తెలుగులో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతో మంది తక్కువ కాలంలోనే పాపులారిటీ తెచ్చుకున్నారు.  ముఖ్యంగా యాంకర్లు అనసూయ, రష్మీ బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తమ జోరు కొనసాగిస్తున్నారు. గత ఏడాది ‘రంగస్థలం’సినిమాతో అనసూయ ‘రంగమ్మత్త’పాత్రతో మెప్పించింది.  జబర్ధస్త్ లో వస్తున్న కమెడియన్లు వెండితెరపై తమ కామెడీ పండిస్తున్నారు. అలా కామెడీ పండించిన వారిలో శకలక శంకర్ ఒకరు.  తెలుగు తెరపై చిన్న పాత్రల్లో కనిపించిన షకలక శంకర్ తర్వాత  ‘శంభో శంకర’ మూవీ హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా మూవీ  `నేనే కేడీ నెం-1’.

ఈ మూవీని ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై  ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని  స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పుడున్న ఈ స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి వ‌దిలేస్తున్నారు.

ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. త‌ప్ప‌కుండా ప్రతి త‌ల్లిదండ్రీ తో పాటు పిల్ల‌లు చూడాల్సిన చిత్రం ఇది. సమాజం, ప్రజలు, తల్లిదండ్రులపై ఎందుకు కోపం పెంచుకున్నాడు అన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారట. షకలక శంకర్,  ముస్కాన్,  ముకుల్ దేవ్‌, నికిషా ప‌టేల్ , క‌రాటే క‌ళ్యాణి,  దేవ‌న్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: అజ‌య్ ప‌ట్నాయ‌క్‌;  కెమెరాః శ్రావ‌ణ్ కుమార్;  ఎడిట‌ర్ః సాములేటి శ్రీనివాస్ ;  స్టోరీ - స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాత :జాని



మరింత సమాచారం తెలుసుకోండి: