తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష హీరోలు ఎంతో మంది వచ్చారు.  ముఖ్యంగా తమిళ, కన్నడ, మళియాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు తమ సత్తా చాటారు.  ఆ మద్య నాని, సమంత జంటగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఆ తర్వాత బాహబలి చిత్రంలో కనిపించాడు.  అడపాదడపా తెలుగు చిత్రాల్లో కనిపిస్తున్న కిచ్చా సుదీప్ తాజాగా ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌హిల్వాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంతో కోసం కొంత కాలంగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట.  ఈ చిత్రంలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నాడు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. కన్నడలో ఇటీవల ఓ టీజర్ రిలీజ్ చేశారు.  స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే నిపుణున్ని కూడా పిలిపించారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో ప‌హిల్వాన్ అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. 

తాజాగా తెలుగులో  మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..ఈ లుక్ చూస్తుంటే సుదీప్ నిజంగా పెద్ద  పహిల్వాన్ లా కనిపిస్తున్నారని అన్నారు.  వ‌చ్చాడ‌య్యో ప‌హిల్వాన్ అనే సాంగ్‌ని రేపు సాయంత్రం 6.30ని.ల‌కి విడుద‌ల చేయ‌నున్నట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది చిత్ర బృందం. 


మరింత సమాచారం తెలుసుకోండి: