యంగ్ హీరో నాగశౌర్య అందరిలా కాకుండా ముందు నుంచి డిఫ్రెంట్ జోనర్స్ లో కథలను ఎంచుకొని సినిమాలను చేస్తూ వస్తున్నాడు. హిట్ ఫ్లాప్స్ గురించి అటుంచితే తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. అదే విధంగా ఇప్పుడు సినిమా ఒకటే .. కానీ అందులో ఏకంగా ఏడు గెటప్పుల్లో నటించి సర్ ప్రైజ్ చేయబోతున్నాడట నాగశౌర్య. గత వారం రిలీజైన ఓ బేబిలో కామియోలో కనిపించినా మంచి నటనతో ఆకట్టుకున్న శౌర్య ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఓ బేబి సక్సెస్ సందర్భంగా మీడియా తో మాట్లాడిన శౌర్య తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలని రివీల్ చేశారు. 

సొంత బ్యానర్ లో అశ్వత్థామ చేస్తున్నా. అలాగే ఊహలు గుసగుసలాడే కాంబినేషన్ రిపీటవుతోంది.  అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి  సినిమాలో నటిస్తున్నా. ఇందులో  ఏడు గెటప్పుల్లో కనిపిస్తాను. ఒకే పాత్రలో ఏడు షేడ్స్ ని చూపించే ఛాన్స్ దక్కిందని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక వీటితో పాటు పార్థు అనే మరొక సినిమాలోనూ నటిస్తున్నా.. అని తను నటిస్తున్న వరుస సినిమాల గురించి చెప్పారు శౌర్య. అలాగే అశ్వత్థామ సినిమాకి కథ అందించాను. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దీనికి నా పేరు టైటిల్స్ లో వేసుకుంటున్నా.. ఇంతకుముందు ఛలో సినిమాకి కథ అందించినా నా పేరు వేసుకోలేదు.. అన్నాడు.

ఓ బేబిలో కామియో చేశారు... ఇలాంటివి హీరోగా మీ ఇమేజ్ కి ఇబ్బంది కాదా? అని ప్రశ్నిస్తే..హిట్ సినిమాలో భాగం కావాలనే చేశాను. పైగా నందిని రెడ్డి అక్కలాంటిది. అవసరాల కుటుంబ సభ్యుడితో సమానం. నందిని నాకు ఆ పాత్రను చెప్పాలా వద్దా? అని డైలమాలో ఉన్నప్పుడు మా అమ్మ (ఉష ముల్పురి) నా చేత ఓకే చేయించారు. కథ వినగానే హిట్టయ్యే చిత్రమిది అనిపించి వెంటనే ఓకే చేశాను అని తెలిపారు. ఏదేమైనా నాగశౌర్య చాలామంది యంగ్ స్టార్స్ కి ఇన్స్పిరేషన్‌గా అనుకోవచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: