లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే సినిమాల్లో చిన్న పాత్రలతో అలరించిన నవీన్ పొలిశెట్టి రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సాయ్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో సత్తా చాటాడు. స్వరూప్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. అసలేమాత్రం అంచనాలు లేని ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులు థియేటర్లకు రాగా సినిమా నచ్చి సూపర్ హిట్ చేశారు.


ఈ సినిమాతో ఇన్నాళ్ల తన ప్రయత్నానికి ఓ ఫలితం లభించిందని చాలా ఎక్సైట్ అవుతున్నాడు నవీన్. ఇక ఏజెంట్ ఆత్రేయ హిట్ కొట్టడమే కాదు ఇప్పుడు బడా నిర్మాణంలో సినిమా ఓకే చేసుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో అతని నటన చూసి మెచ్చిన స్వప్న దత్ ఆమె నిర్మించే సినిమాలో అతన్ని ఫైనల్ చేసింది. 


ఈ సినిమాకు దర్శకుడిగా పిట్టగోడ ఫేం అనుదీప్ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. స్వప్నా సినిమాస్ బ్యానర్ లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చింది. ఆ తర్వాత మహానటి కూడా ఈ బ్యానర్ లో నిర్మించిన సినిమానే. రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు నవీన్ తో చేసే సినిమాపై అంచనాలు పెరిగాయి. 


నవీన్ కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇక సినిమా ఫుల్ కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హిట్ అందుకున్న నవీన్ ఈ లక్కీ ఛాన్స్ అందుకుంటాడని ఊహించి ఉండడు. మొత్తానికి టాలెంట్ తో కష్టపడితే ఎప్పటికైనా ఫలితం తమ వెంటే ఉంటుందని మరోసారి నవీన్ ద్వారా ప్రూవ్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: