నిన్నటిదాకా సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అంటే అందరు ఇంకెవరు నయనతార అనే వారు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే సోలో సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది నయనతార. అక్కడ నయనతార సోలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే స్టార్స్ కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.


అయితే రోజులు ఎప్పుడూ ఒకేళా ఉండవు కదా సోలోగా సూపర్ హిట్లు కొట్టిన నయన ఈమధ్య ఎందుకో ట్రాక్ తప్పింది. అమ్మడు సినిమాలు బోర్ కొట్టాయో ఏమో కాని ప్రస్తుతం నయన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తున్నాయి. అయితే ఆమె స్థానంలో కొత్తగా సమంతకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.


అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా కొత్త స్టెప్ తీసుకున్న సమంత కెరియర్ ప్లానింగ్ లో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఎక్కువగా సోలో సినిమాలకు ప్రియారిటీ ఇస్తుంది. రంగస్థలం తర్వాత యూటర్న్, మజిలీ హిట్ అవగా లేటెస్ట్ గా వచ్చిన ఓ బేబీ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అందరి చూపు సమంత మీద పడ్డది.


కోలీవుడ్ లో నయన లీడ్ రోల్ చేసిన అరమ్ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడు దర్శకుడు గోపీ నరైన్. ముందు ఈ సీక్వల్ కు నయనతారని అనుకోగా ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటిదాకా నయనతార టైం నడిస్తే ఇకనుండి సమంత టైం స్టార్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు సామ్ ఫ్యాన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: