అల్ల‌రి మాట‌ల‌తో ఉరక‌లెత్తే అంద‌మైన న‌వ్వుల జ‌ల‌పాతం న‌భాన‌టేష్‌. ఈ క‌న్న‌డ క‌స్తూరి ప్ర‌తి ప‌లుకులో చ‌లాకీత‌నం ఉట్టిప‌డుతుంటుంది. అదుగో న‌న్నుదోచుకుందువ‌టే చిత్రాల‌తో ఈ సొగ‌స‌రి కుర్ర‌కాదు హృద‌యాల్ని దోచుకుంది. అరంగేట్రం చేసిన అన‌తికాలంలోనే ద‌క్షిణాదిలో చ‌క్క‌టి అవ‌కాశాల‌తో దూసుకుపోతున్న‌ది. రామ్ స‌ర‌స‌న న‌భాన‌టేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్ ఈ నెల 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఆమె పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు...


సినిమాలో మీ పాత్ర చిత్ర‌ణ ఒక్కొక్క‌రిని హ‌డ‌లెత్తించిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది?
ఈ సినిమాలో నేను చాందిని అనే సివిల్ ఇంజ‌నీర్ పాత్ర‌ను పోషించాను. నా ప‌క్క‌న ప‌ని చేసేవాళ్లంద‌రూ మ‌గ‌వాళ్లే కాబ‌ట్టి వారిని డామినేట్ చేస్తూ ఉంఆను. చాందినికి చ‌లాకీత‌నంతో పాటు ధైర్య‌మూ ఎక్కువే. హీరో రామ్‌తో కూడా ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రింస్తుంటాను.  అదెందుక‌నేది సినిమా చూస్తే తెలుస్తుంది.


తెలంగాణ యాస‌ను బాగా ప్రాక్టీస్ చేసిన‌ట్లున్నారు?
డ‌బ్బింగ్ నేను చెప్ప‌లేదు కానీ నా పాత్ర కోసం తెలంగాణ డైలాగ్స్‌ను బాగా ఒంట‌ప‌ట్టించుకున్నాను. క‌థ చెప్పిన త‌ర్వాత నా పాత్ర‌కు సంబంధించిన డైలాగ్ వెర్ష‌న్  తీసుకుని నెల‌రోజుల పాటు ప్రాక్టీస్ చేశాను. ప్ర‌తి ప‌దానికి అర్ధం తెలుసుకున్నాను. తెలంగాణ యాస‌లో ఎలా మాట్లాడాలో బాగా తెలుసుకున్నాను. అయితే సంభాష‌ణ‌ల వ్య‌క్తీక‌ర‌ణ‌లో మ‌రికొంత ప‌రిపూర్ణ‌త వ‌స్తే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పేదాన్ని.


ప్ర‌తి సినిమాలో హుషారైన అమ్మ‌యి పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. బ‌య‌ట కూడా మీరు అలాగే ఉంటార‌ని తెలిసింది?
న‌న్ను దోచుకుందువ‌టే చిత్రంలో చ‌లాకీ అమ్మాయిగా క‌నిపించాను. ఇస్మార్ట్ శంక‌ర్‌లో నా పాత్ర అందుకు భిన్నంగా ఉంటుంది. ఇది కొంచం మాస్ టైప్‌. నిజ జీవితంలో కూడా నేను ఎప్పుడూ హుషారుగా ఉంటాను. కాలేజీ రోజుల్లో బాగా అల్ల‌రి చేసేదాన్ని. దాంతో కాలేజీ వాళ్లు ఇంటికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తారేమోన‌ని భ‌య‌ప‌డేదాన్ని(న‌వ్వుతూ)


పూరి జ‌గ‌న్నాథ్ వంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడితో క‌లిసి ప‌నిచేయ‌డం ఎలాంటి అనుభూతినిచ్చింది?
పూరిగారు సెట్స్‌లో చాలా కూల్‌గా ఉంటారు. ప‌ర్‌ఫార్మెన్స్ గురించి ఎప్పుడూ ఒత్తిడి చేయ‌రు. నీకు న‌చ్చిన‌ట్లుగా యాక్ట్ చేయి. అవ‌స‌రంలేనివి ఎడిటింగ్‌లో తీసిచేద్దాం అని చెప్పేవారాయ‌న దాంతో ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ప్ర‌తి సీన్‌లో స‌హ‌జంగా అభిన‌యించ‌గ‌లిగాను. పూరిగారితో క‌లిసి ప‌ని చేయ‌డం వల్ల న‌టిగా ప‌రిణితి చెందిన భావ‌న క‌లిగింది.


రామ్‌తో క‌లిసి తొలిసారి నటించారు. ఇస్మార్ట్ శంక‌ర్‌తో మీ ఫైట్ ఎలా ఉంటుంది?
సినిమాలో మా ఇద్ద‌రి పాత్ర‌లు డామినేటింగ్ గా ఉంటాయి. ప్రేమ ద్వేషం చుట్టూ తిరిగే బంధం మాది. చివ‌ర‌కు మా ఇద్ద‌రి  ప్ర‌యాణం ఏ గ‌మ్యానికి చేరుకుంద‌నేది ఆస‌క్తిగా ఉంటుంది. రామ్ శంక‌ర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. సెట్స్‌లో కూడా ఆయ‌న తెలంగాణ యాస‌లోనే మాట్లాడేవారు. అంత‌గా త‌న పాత్ర‌ను  ప్రేమించారు.

సినిమాలో మీరు చెప్పిన డైలాగ్స్‌లోఇష్ట‌మైన‌దొక‌టి?
ఛ‌లోరే సాలే నీలాంటోళ్ల‌ను మ‌స్త్ మందిని చూసిన అంటూ ఓ వ్య‌క్తికి వార్నింగ్ ఇచ్చే స‌న్నివేశంలోని డైలాగ్ బాగా న‌చ్చింది. సినిమాలో ఈ త‌ర‌హా సంభాష‌ణ‌లు చాలానే ఉంటాయి.


ఈ సినిమా నిర్మాత‌ల్లో ఛార్మి ఒక‌రు. ఆమెతో షూటింగ్ అనుభ‌వాలు ఎలా ఉన్నాయి?
క‌థానాయిక‌గా ఛార్మికి సుదీర్ఘ అనుంభ‌వం ఉంది కాబ‌ట్టి నిర్మాత‌గా బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్ధ‌వంతంగా  వ్య‌వ‌హ‌రించింది. షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఎలాంటి సందేహాలున్నా నిర్మొహ‌మాటంటా ఆమెతో ఆమెతో చ‌ర్చించేదాన్ని మ‌హిళ‌లు నిర్మాత‌లుగా ఉండ‌టం వ‌ల్ల క‌థానాయిక‌ల‌కు కొంత స్వేచ్ఛ ఉంటుంది.

సినిమాలో రొమాన్స్ మోతాదుకు మించి ఉన్న‌ట్లుగా క‌నిపిస్తుంది?
అలాంటి ఏమీ లేదు పాట‌ల్లో ఏద కొన్ని స‌న్నివేశాల్లో త‌ప్ప సినిమాలో క్యూట్ రొమాన్స్ఉంటుంది. ఎక్క‌డా హ‌ద్దులు దాటిన‌ట్లు క‌నిపించ‌దు. 


భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు ఏమిటి?
ర‌వితేజ‌తో  క‌లిసి  డిస్కోరాజా చిత్రంలో న‌టిస్తున్నాను. మ‌రికొన్ని పెద్ద చిత్రాల్లో నాయిక‌గా అడిగారు. అన్ని క‌న్‌ఫ‌ర్మ్‌ద అయ్యాక వివ‌రాల్ని వెల్ల‌డిస్తాను. త‌మిళంలో కూడా ఓ సినిమాకు అంగీక‌రించాను. అరంగేట్రం చేసిన అన‌తికాలంలోనే అవ‌కాశాలు వ‌రించ‌డం ఆనందంగా ఉంది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు న‌ట‌నాప‌రంగా
 స‌వాలుతో కూడుకున్న పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: