ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని సెంటిమెంట్లు తప్పకుండా ఫాలో అవుతారు. కొన్ని సెంటిమెంట్లు మనం కావాలని ఫాలో అవుతాం మరికొన్ని సెంటిమెంట్లు మాత్రం యాదృచ్చికంగా జరుగుతాయి. అలాంటి సెంటిమెంట్ ఒకటి బిగ్ బాస్ తెలుగు షోలో జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు షో సీజన్ 1 ఎన్టీయార్ హోస్ట్ చేయగా సీజన్ 2 నాని హోస్ట్ చేసాడు. మరో వారంలో ప్రారంభం కాబోతున్న సీజన్ 3 ను నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడు. 
 
ఈ షో హోస్ట్ చేసిన ముగ్గురి పేర్లు తెలుగులో "న" అక్షరంతో ఇంగీష్లో "ఎన్ " తో మొదలు కావటం విశేషం. ఎన్టీయార్ హోస్ట్ చేసిన సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా నాని హోస్ట్ చేసిన సీజన్ 2 హిట్ అయ్యింది. అందువలన నాగార్జున హోస్ట్ చేస్తున్న సీజన్ 3 కూడా ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. జులై 21 వ తేదీనుండి రాత్రి 9 గంటలకు ఈ షో స్టార్ మా ఛానెల్లో ప్రసారం కాబోతుంది. 
 
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన సెలబ్రిటీల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సెలబ్రిటీలతో ఇంట్రడక్షన్ వీడియోలు షూట్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీలనే ఈసారి ఎక్కువగా తీసుకున్నారట. సామాన్యులకు ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం ఇవ్వనట్లు తెలుస్తుంది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేసి సూపర్ హిట్ చేసిన నాగార్జున బిగ్ బాస్ షోను ఏ స్థాయికి తీసుకెళతాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: