డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్ సినిమా లయన్ కింగ్. ఈ సినిమా ఇండియాలో వచ్చే వారంలో దాదాపు అన్ని ప్రధాన భాషల్లోనూ విడుదల కానుంది. అయితే, ఒక వారం ముందుగానే దీనిని చైనాలో విడుదల చేశారు. ముందస్తుగా అక్కడ విడుదలైన లయన్ కింగ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా డిస్నీ గత చత్రాలు ‘జంగిల్‌బుక్‌’(11.6 మిలియన్‌ డాలర్లు), ‘బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’(12.4 మిలియన్‌ డాలర్లు) చిత్రాల ఓపెనింగ్‌ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. చైనాలో తొలి రోజే ఈ చిత్రం 14.5మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు హాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 


ఇక అమెరికాతో పాటు, భారత్‌లోనూ ఈనెల 19న 'ది లయన్‌ కింగ్‌' విడుదల కానుంది. ఈ మద్య హాలీవుడ్ ఈ తరహా చిత్రాలకు స్టార్ హీరోలు, స్టార్ కమెడియన్లు తమ వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రత్యేంగా నిలుస్తుంది. దాంతో తెలుగు నేటివిటీ ఇందులో ప్రస్పుటంగా కనిపించడంతో తెలుగు ప్రేక్షకుల బాగా ఆదరిస్తున్నారు.


ఇక ‘ది లయన్ కింగ్’  పాత్రలకు తెలుగులో నాని, రవిశంకర్‌, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం, లిప్సిక డబ్బింగ్‌ చెప్పారు. దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో సిద్ధార్థ్‌, అరవిందస్వామిలు డబ్బింగ్‌ చెప్పగా, హిందీలో షారుఖ్‌ఖాన్‌, ఆయన తనయుడు ఆర్యన్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: