తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్. దర్శకుడు ఎ ఎల్ విజయ్ ను పెళ్ళి చేసుకుని రెండేళ్ళ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తరువాత అమలా పాల్ వరుస సినిమాల్లో నటిస్తుంది. రేపు (జులై 19 2019) అమలా పాల్ నటించిన "ఆమె" సినిమా విడుదల కాబోతుంది. "ఆమె" సినిమా ప్రమోషన్లలో భాగంగా అమలా పాల్ తాను ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పారు. 
 
తన బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పనప్పటికీ బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన రహస్యాలు మాత్రం మీడియాతో పంచుకుంది. నా బాయ్ ఫ్రెండ్ నాకోసం ఒకరున్నారనే అనుభూతి కలిగించాడని నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని అమలాపాల్ చెప్పింది. రేపు విడుదల కాబోతున్న ఆమె సినిమాలో న్యూడ్ సీన్లలో నటించాల్సి వచ్చినపుడు బాయ్ ఫ్రెండ్ నా నిర్ణయాన్ని మెచ్చుకున్నాడని, నాకు నా బాయ్ ఫ్రెండ్ పూర్తి స్వేఛ్చనిస్తాడని తెలిపారు. 
 
ఆమె సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో 15 నుండి 20 నిమిషాలదాకా నగ్న సన్నివేశాలున్నాయని ఈ సీన్లలో నటిస్తున్నానని అమ్మకు చెప్పినప్పుడు అమ్మ ఎంతో ధైర్యం చెప్పిందని అమలా పాల్ అన్నారు. తన భర్తతో విడిపోయినా తనకు బాధ గా లేదని విజయ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అమలా పాల్ అన్నారు. బాయ్ ఫ్రెండ్ తో పెళ్ళి చేసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అమలా పాల్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: