హీరోలకి  స్టార్ హీరోల స్టేటస్ వచ్చాక వారు నటించే ప్రతి సినిమా విషయంలోను తీసుకునే శ్రద్ధ చాల పెరిగిపోవడంతో ప్రతి చిన్న విషయంలోనూ వారి ప్రమేయం పెరిగిపోతుంది. చివరకు ఆసినిమాకు సంబంధించిన చిన్న టీజర్ కటింగ్ నుండి ఆసినిమా ఎడిటింగ్ వరకు టాప్ హీరోలు తమకు అనుభవం ఉన్నా లేకున్నా ఏవో ఒక సలహాలు ఇస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. 

అయితే టాప్ హీరో స్థాయికి ఎదిగినా ప్రభాస్ తీరు మటుకు వేరు. అతడు ఏ విషయాన్ని పెద్ద సీరియస్ గా పట్టించుకోవడం కానీ లేదంటే ఎదుటి మనిషిని నొప్పించే విధంగా మాట్లాడటం చేయడు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ప్రభాస్ ను ఈజీ గోయర్ గా చెపుతారు. సినిమా షూటింగ్ లేకుంటే కేవలం తన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యే ప్రభాస్ దేశ రాజకీయాల గురించి మాత్రమే కాదు సినిమా రాజకీయాల గురించి హీరోల నెంబర్ వన్ స్థానాల గురించి పట్టించుకోడు. 

ప్రభాస్ కు ఉన్న ఈతీరు ప్రస్తుతం ‘సాహో’ కి శాపంగా మారిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీకి సంబంధించి దర్శకుడు సుజిత్ కు అనుభం లేకపోయినా ఇంత భారీ ప్రాజెక్ట్ అతడికి అప్పచేప్పడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడమే కాకుండా బడ్జెట్ కూడ విపరీతంగా పెరిగి పోయింది. ఈమూవీ సంగీత దర్శకులు మారిపోయినా ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ కు సంబంధించిన నిర్ణయాలలో ప్రభాస్ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు అని అంటారు. 

ఈమూవీ విషయాలు అన్నింటి పై పూర్తిగా దర్శకుడు సుజిత్ పై అదేవిధంగా ఈమూవీ నిర్మాతల పై పూర్తిగా ఆధారపడిన ప్రభాస్ ఈమూవీకి సంబంధించిన పొరపాట్ల పై చివరి నిముషంలో శ్రద్ధ పట్టడంతో గందరగోళం ఏర్పడి ఇప్పుడు ఏకంగా ‘సాహో’ విడుదల దీపావళి వరకు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితులలో సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ ‘సాహో’ కు ప్రభాస్ కు ఉండే సహజ సిద్ధమైన ఉదాశీనత ఇప్పుడు సమస్యగా మారింది అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: