టాలీవుడ్ లో ఒకప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించిన విక్రమ్ తర్వాత హీరోగా మారారు.  తెలుగు లో పెద్దగా కలిసి రాకపోవడంతో కోలీవుడ్ లోకి వెళ్లాడు.  అక్కడ శివపుత్రుడు లాంటి ప్రయోగాత్మక మూవీతో ఒకేసారి స్టార్ ఇమేజ్ సంపాదించాడు.  ఆ తర్వతా డైరెక్టర్ శంకర్ తీసిన ‘అపరిచితుడు’సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.  అప్పటి నుంచి చియాన్ విక్రమ్ గా పేరు తెచ్చుకున్నాడు.

  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన విక్రమ్ ఈ మద్య వరుస డిజాస్టర్లు అందుకుంటున్నాడు.  ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి శంకర్ దర్శకత్వంలో ‘ఐ’లాంటి ప్రయోగాత్మక సినిమా కూడా పెద్దగా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. తాజాగా విక్రమ్‌ హీరోగా అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ 'మిస్టర్‌ కేకే'.   రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వం లో తమిళంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై 'కదరమ్‌ కొండన్‌' పేరుతో రూపొందింది.

తెలుగులో టి.నరేష్‌ కుమార్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా 'మిస్టర్‌ కేకే' పేరుతో విడుదల చేసారు. విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అని తేలిపోయింది. అసలు కమల్, విక్రమ్ ఇలాంటి సినిమాని ఎలా ఓకే చేసారనేది మిస్టరీ గా చెప్తున్నారు. ఎటుచూసినా విక్రమ్ కు మరోసారి భాక్సాఫీస్ దగ్గర పెద్ద దెబ్బే పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: