యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ నటించిన కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. తిరుగులేని వ‌సూళ్ల‌తో రామ్‌-పూరికి చాలా రోజుల త‌ర్వాత హిట్ ఇచ్చిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ప్రేక్ష‌కుల నుంచి మాంచి స్పంద‌న వ‌స్తోంది. బి, సి సెంటర్ల ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. తొలి రోజే రూ.8 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా నాలుగు రోజులు గాను తెలుగు రాష్ట్రాల్లో రూ.21.42 కోట్లు రాబట్టిందీ చిత్రం.


ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్‌గా దుమ్ము రేపుతోన్న ఈ సినిమాకు ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు మాత్రం షాక్ ఇచ్చారు. పూరి మాస్ మంత్రం అక్క‌డ అంతగా పనిచేయలేదు. ప్రీమియర్ల ద్వారా 51,677 డాలర్లను, గురువారం 31,893, శుక్రవారం 41,579, శనివారం 56,898 డాలర్లును రాబట్టిన ఈ సినిమా మూడు రోజులకు కలిపి 1, 83,338 డాలర్లను మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఏపీ, తెలంగాణ వ‌సూళ్లను ఓవ‌ర్సీస్ వ‌సూళ్ల‌తో కంపేరిజ‌న్ చేస్తూ అక్క‌డ ఇస్మార్ట్ శంక‌ర్ డ‌బుల్ డిజాస్ట‌ర్ అయ్యిందే అనుకోవాలి. 


ఈ సినిమా కొన్న ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్‌కు భారీ న‌ష్టాలు త‌ప్ప‌వు. ఇటీవ‌ల వ‌చ్చిన మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా సైతం ఏపీ, తెలంగాణ‌లో లాభాలు గ‌డిస్తే ఓవ‌ర్సీస్‌లో అంచ‌నాలు అందుకోలేదు. దీనిని బ‌ట్టి అమెరికా ఆడియన్స్ పూరి నుండి కొత్తదనాన్ని ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీనికి తోడు ఇస్మార్ట్ శంక‌ర్‌ను అక్క‌డ చాలా లిమిటెడ్ లొకేష‌న్ల‌లో మాత్ర‌మే రిలీజ్ చేయ‌డం కూడా క‌లెక్ష‌న్లు త‌క్కువుగా ఉండ‌డానికి మ‌రోకార‌ణం.



మరింత సమాచారం తెలుసుకోండి: