పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం "కాటమ రాయుడు". ఇది తమిళంలో అజిత్ హీరోగా నటించిన వీరం అనే సినిమాకి రీమేక్. ఇందులో పవన్ సరసన శ్రుతి హాసన్ నటించింది. శర మరార్ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ పార్థసాని తెరకెక్కించాడు. సినిమా రిలీజ్ కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలోని పవన్ గెటప్ ను ఫాలో అయిపోయారు. అప్పట్లో ఒక ట్రెండ్ గా నిలిచింది ఆ గెటప్.


ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక బోల్తా పడింది. దీంతో చిత్ర మూనిట్ తో పాటు పవన్ కళ్యాణ్ నిరాశకు గురయ్యారు. తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాజిద్ నదియావాలా రీమేక్ హక్కులను తీసుకున్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.


ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ముందుగా అక్షయ్ కుమార్ ని హీరోగా అనుకున్నారట. కానీ అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి ఒప్పుకోలేదు.అయితే, అదే సమయంలో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ద్వారా స్టార్ హీరోగా మారిన విక్కీ కౌశల్‌ను సంప్రదించారు. దీనికి అతడు ఓకే చెప్పడంతో బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసారు.


అయితే ప్రస్తుతం విక్కీ కౌశల్ బిజీగా ఉండడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. కిట్టీ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు కాని కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఈ కారణంగా అతడు సినిమా చేయట్లేదని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేసారు. మరి పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు సినిమాలో ఏ బాలీవుడ్ యాక్టర్ కనిపిస్తారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: