రజనీకాంత్ సినిమా అంటే సౌత్ లోనే కాదు ఇండియా మొత్తం క్రేజ్ ఉంటుంది. జపాన్ లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తుంటారు. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టు విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. రజనీ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ లో నటిస్తున్నారు.


దర్బార్ లో రజనీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్, సోషల్ యాక్టివిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మూవీలో రజనీ పోలీస్ గెటప్ లో ఉన్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఈ పిక్ లోరజనీ చాలా రఫ్ గా ఉన్నాడు. స్టైలిష్ గా నడుస్తూ ఉన్న రజనీ పిక్ చూసి ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రజనీ గతంలో మూండ్రుముగమ్, పాండియన్, కోడి పరకుతు అనే సినిమాల్లో పోలీస్ గా నటించాడు. చాలా కాలం తరువాత ఖాఖీ గెటప్ వేయడంతో ఈ సినిమాలో రజనీ మెరుపు ఖాయమని, రజనీ మార్క్ స్టైల్ ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నషూటింగ్ ఆగష్టు ఎండ్ తో పూర్తవుతుంది. రజనీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.


కొన్నేళ్లుగా రజనీ సినిమా ఏదీ ఆశించిన స్థాయిలో హిట్ కావటం లేదు. రోబో ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. ఆ మార్క్ హిట్ మళ్లీ రజనీకి లభించలేదు. కానీ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మురుగదాస్ పై నమ్మకం, రజనీ పోలీస్ పాత్ర వంటివి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: