బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వయసు యాభై దాటింది.  ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.  ఎన్నిసార్లు దీని గురించి అడిగినా ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకుంటున్నాడు.  తల్లి దండ్రులు కూడా పెద్దగా ఫోర్స్ చేయకపోవడం విశేషం.   బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తప్పించి మిగతా హీరోలకు వారసులు ఉన్నారు.  


వాళ్ళను రేపోమాపో సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  షారుక్ ఖాన్ కూతురు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.  అటు అమిర్ ఖాన్ కూతురు కూడా రెడీ అవుతున్నది. సోహైల్ ఆలీ ఖాన్ కూతురు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది.  


బాలీవుడ్ టాప్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తుంటే.. సల్మాన్ మాత్రం ఇంకా స్టైల్ బ్యాచులర్ గానే ఉన్నారు.  దీని గురించి అడిగితె తనను పెళ్లి చేసుకోమని ఎవరు అనలేదని.. పెళ్లి చేసుకుంటే మంచి భర్త కాలేను అని అంటున్నాడు.  మంచి భర్త కాలేకపోయినా.. మంచి తండ్రి మాత్రం అవుతానని అంటున్నాడు.  


తనకు తండ్రి కావాలని ఉందని ఇప్పటికే సల్మాన్ ఖాన్ చెప్పారు.  దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.  సరోగసి విధానం ద్వారా తండ్రి అయ్యేందుకు షారుక్ రెడీ అవుతున్నాడు.  మరి ఈ విధంగానైనా సల్మాన్ కల నెరవేరుతుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: