టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న కలయికలో రాబోతున్న కొత్త మూవీ డియర్ కామ్రేడ్, రేపు భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ రివ్యూ నేటి అర్ధరాత్రి ఓవర్సీస్ నుండి వెల్లడి కానున్నట్లు సమాచారం. అయితే కాసేపటి క్రితం నుండి ఈ సినిమాలో హైలైట్స్ ఇవేనంటూ ఒక వార్త ప్రచారం అవుతోంది. ఆ వార్తను బట్టి, 

విజయ్ ఈ సినిమాలో కాలేజి యూత్ లీడర్ గా, మిగతా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చే నాయకుడిగా కనపడనునట్లు చెప్తున్నారు. ఇక కెరీర్ పరంగా తొలిసారి రష్మిక ఒక క్రికెటర్ పాత్రలో నటిస్తోందట. ఇకపోతే చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ అయిన హీరో, హీరోయిన్లు మధ్యలో విడిపోవడం, మళ్ళి పెద్దయ్యాక అనుకోకుండా కలసిన తరువాత వారిద్దరి మధ్యన ప్రేమ చిగురించడం జరుగుతుందట. అయితే హీరోయిన్ మాత్రం తన కెరీర్ గోల్ కోసం హీరో సపోర్ట్ కోరితే, అందుకు ఒప్పుకున్న హీరో, మధ్యలో కొన్ని గొడవల కారణంగా ఆమెకు దూరమవుతాడట. అయితే మళ్ళి చివరకు వారిద్దరూ ఎలా కలిశారు అనేది కథలోని కీలకాంశం అని సమాచారం. 

ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం జస్టిన్ ప్రభాకర్ అందించిన మ్యూజిక్ సూపర్ అవడం, అలానే ట్రైలర్ లో చూపించినట్లు సినిమాలో మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో విజయ్ ఫ్యాన్స్ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తున్నారు. అదీకాక గీత గోవిందం తరువాత విజయ్ మరియు రష్మిక కలయికలో రాబోతున్న సినిమా కాబట్టి, ఈ సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనపడుతోంది. మరి ప్రస్తుతం ఈ సినిమాలోని హైలైట్స్ విషయమై ప్రచారం అవుతున్న వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే రేపు సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: