ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ఖుషి ఓ స్పెష‌ల్ మూవీ అని చెప్పోచ్చు.  ఆయ‌న సినిమాలు ఎలా ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు.  ఖుషి యూత్‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చింది.   చాలాకాలం పాటు ఆ మానియా నుంచి అభిమానులు బ‌య‌ట‌కు రాలేదు.  ఖుషి త‌రువాత ప‌వ‌న్ కు స‌రైన హిట్ లేదు.  మ‌రో హిట్ కోసం ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా వ‌ర‌కు వ‌యిట్ చెయాల్సి వ‌చ్చింది అంటే అర్దం చేసుకోవ‌చ్చు.   

ఇందులో ప‌వ‌న్ కు జోడిగా భూమిక న‌టించింది.  భూమిక న‌ట‌న సినిమాలో సూప‌ర్బ్ అని చెప్పోచ్చు.  ఈ సినిమా త‌రువాత భూమిక‌కు అనేక ఆఫ‌ర్లు వ‌చ్చాయి.  కేరీర్ మంచి ద‌శ‌లో ఉండ‌గానే ఈ హీరోయిన్ పెళ్లి చేసుకొని సెటిల్ ఆయ్యింది.  కొన్నాళ్ల త‌రువాత తిరిగి సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది.  సెకండ్ ఇన్నింగ్స్ ఫ‌ర్వాలేద‌నిపింస్తోంది.  

కొన్ని సినిమాల్లో ఇప్ప‌టికే న‌టించిన భూమికకు అదిరిపోయో ఆఫ‌ర్ వ‌చ్చింది.  బాల‌కృష్ణ హీరోగా చెస్తున్న క్రాంతి సినిమాలో హీరోయిన్ గా భూమిక‌ను తీసుకోబోతున్నారు అని స‌మాచారం.  ఈ సినిమాలో ఇప్ప‌టికే లెజెండ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ బుక్క‌యింది.  రెండో హీరోయిన్ గా భూమిక‌ను సెల‌క్ట్ చెస్తున్నార‌ని స‌మాచారం.  

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కెఎస్ రవికుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఇటీవ‌లే సినిమాకు సంబందించిన పూజా కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.  కెఎస్ ర‌వికుమార్ సినిమాకంటే ముందు బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేయాల్సి ఉన్నా... కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆగిపోయింది.  బ‌డ్జెట్ కార‌ణంగానే సినిమా ఆగిపోయిన‌ట్టు స‌మాచారం.  

త్వ‌ర‌లోనే వీరి కాంబినేష‌న్లో సినిమా ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం.  అయితే, బాల‌కృష్ణ‌తో పూరి జ‌గ‌న్నాథ్ సినిమా చేసేందుకు సిద్దం అవుతున్న సంగ‌తి తెలిసిందే.  ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ హిట్టైతే, సినిమా చేసే ఛాన్స్ ఇస్తాన‌ని బాల‌య్య పూరీకి హామి ఇచ్చాడ‌ట‌.  పూరీ ఇస్మార్ట్ హిట్టయ్యింది.  మ‌రి బాల‌య్య త‌న మాట‌ను నిలుపుకోవాలిక‌దా... 


మరింత సమాచారం తెలుసుకోండి: