టాలీవుడ్‌లో గ‌త 20 ఏళ్లుగా బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్లు కొట్టి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మంచి మార్కెట్ తెచ్చిపెట్టాయి. మ‌రియు అత్య‌ధిక లాభాలు పొందిన సినిమాలు కూడా ఉన్నాయి. మ‌రి అవేంటో ఇప్పుడు చూద్దాం..


సమ‌ర సింహా రెడ్డి:  బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్ జంట‌గా న‌టించిన సినిమా `స‌మ‌ర సింహా` రెడ్డి. ఈ సినిమా 1999లో రిలీజ్ అయింది. అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానూ అల‌రించిన ఈ సినిమా రూ. 16.25 కోట్ల  షేర్ రాబట్టుకుంది.


కలిసుందాం రా:  వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన `క‌లిసుందాం రా`. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో 2000 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం ఘనవిజయం సాధించటమే కాక ఉత్తమ తెలుగు చిత్రం గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్నిఅందుకొంది. మంచి హిట్ అయిన ఈ సినిమా రూ. 16.5 కోట్ల షేర్ ద‌క్కించుకుంది.


నువ్వే కావాలి: త‌రుణ్, రిచా జంట‌గా న‌టించిన సినిమా `నువ్వే కావాలి`. ఈ సినిమా 2000లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు కె. విజయభాస్కర్ దర్శకత్వం అందించారు. ఈ సినిమాకు రూ. 19.5 కోట్ల షేరు వ‌చ్చింది. బాక్సాఫిస్ వ‌ద్ద మంచి హిట్‌గా నిలిచింది.


నరసింహ నాయుడు: నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్ క‌లిసి న‌టించిన `న‌ర‌సింహ నాయుడు` 2001లో రిలీజ్ అయింది. బి.గోపాల్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. ఈ సినిమా ఏకంగా 21.75కోట్లు షేర్ రాబ‌ట్టుకుంది.


ఇంద్ర: చిరంజీవి, సోనాలి బింద్రే మ‌రియు ఆరతీ అగర్వాల్ క‌లిసి న‌టించిన సినిమా `ఇంద్ర‌`. 2002లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క్రియేట్ చేసి 29.6కోట్ల షేర్‌ను సంపాదించుకుంది. చిరంజీవి ఫ్యాక్షనిజంపై నటించిన ఈ చిత్రానికి బి.గోపాలు ద‌ర్శ‌కుడు.


ఠాగూర్ : వి.వి. వినాయక్- చిరంజీవి కంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా `ఠాగూర్‌`. ఈ చిత్రంలో చిరంజీవి శ్రియ మ‌రియు జ్యోతిక నటించారు. 2003 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా 28.6కోట్ల షేర్ తెచ్చుకుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు.


శంకర్ దాదా MBBS: జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో 2004లో విడుదలైన సినిమా `శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్`. ఇందులో చిరంజీవి, సోనాలీ బెంద్రే ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫిస్ వ‌ద్ద మంచి హిట్ కొట్టిన ఈ సినిమాకు 29.1కోట్ల షారే వ‌చ్చింది.


అతడు: ప‌్రిన్స్ మ‌హేష్ బాబు, త్రిష జంట‌గా న‌టించిన సినిమా `అత‌డు`. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వ‌హించారు. 2005లో విడుద‌ల అయిన ఈ సినిమా ఎన్నో పుర‌స్కారాలు గెలుచుకుంది. ఈ సినిమాకు 20.6 కోట్ల ల‌భాలు అందుకుంది.


పోకిరి: మ‌హేష్ బాబు, ఇలీయాన క‌లిసి న‌టించిన చిత్రం `పోకిరీ` 2007లో విడుద‌ల అయింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఒక నూతన ఒవరడిని సృస్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఏకంగా 41.2కోట్లు సాధించుకుని.. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.


యమదొంగ: య‌ంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన సినిమా `య‌మ‌దొంగ‌`. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది 2008లో విడుదలైన ఒక సోషియో ఫాంటసీ తెలుగు సినిమా. ఈ చిత్రం బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు సృష్టించి 30.1కోట్ల షేర్‌ను ద‌క్కించుకుంది.


జల్సా: 2008 లో త్రివిక్రం శ్రీనివాస్- ప‌వ‌న్ క‌ళ్యాన్ కంబినేష‌న్లో విడుదలైన సినిమా `జ‌ల్సా. ఈ సినిమాలో ఇలియాన క‌థానాయ‌కిగా న‌టించింది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానూ అల‌రించిన ఈ సినిమా 29.7కోట్ల లాభాలు రాబ‌ట్టుకుంది.


మగధీర:  అల్లు అరవింద్ నిర్మాణంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్ తేజ కథానాయకుడిగా వ‌చ్చిన సినిమా `మ‌గ‌ధీర‌`. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా 2009 రిలీజ్ అయింది. మంచి ఆద‌ర‌ణ ల‌భించిన ఈ సినిమాకు ఏకంగా 71.2కోట్ల షేర్ అందుకుంది.


సింహా:  బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం `సింహా`. ఈ సినిమాలో నమిత, నయనతార మ‌రియు స్నేహ ఉల్లాల్ న‌టించారు. 2010లో విడుద‌ల అయిన ఈ సినిమా మంచి హిట్ కొట్టి 31.3కోట్ల లాభాల‌ను సంపాధించుకుంది.


దూకుడు: మహేశ్ ‌బాబు, సమంత జంట‌గా న‌టించిన సినిమా `దూకుడు`.  శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వం అందించిన ఈ సినిమా 2011లో విడుద‌ల అయింది. అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న ఈ సినిమా వసూళ్ల ప‌రంగా 57.8కోట్ల షేర్ భారీగానే రాబ‌ట్టుకుంది.


గబ్బర్ సింగ్: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టించిన సినిమా `గ‌బ్బ‌ర్ సింగ్‌`. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో విడుద‌ల అయింది.ఈ సినిమా విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 62.5 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.


అత్తరింటికి దారేది: ప‌వ‌న్ క‌ళ్యాన్, స‌మంత జంట‌గా న‌టించిన సినిమా `అత్త‌రింటికి దారేది`. త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు ద‌ర్వ‌క‌త్వం అందించిన ఈ సినిమా 2013లో విడుద‌ల అయింది. తెలుగు సినిమా పరిశ్రమలో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా 76.8కోట్ల షేర్ రాబ‌ట్టుకుంది.


రేసుగుర్రం: స‌్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శ్రుతి హాస‌న్ క‌లిసి న‌టించిన సినిమా `రేసుగుర్రం`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా 58.8కోట్ల షేర్‌ సంపాధించుకుంది.


బాహుబలి 1:  ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన  “బాహుబలి – ద బిగినింగ్”. ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ముఖ్య పాత్ర‌లుగా న‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 2015 ఈ సినిమా విడుద‌ల అయింది. భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా 191 కోట్లు సాధించుకుంది.


జనతా గ్యారేజ్: జునియర్ ఎన్టీఆర్, స‌మంత మ‌రియు నిత్య మీన‌న్ క‌లిసి న‌టించిన సినిమా `జ‌న‌తా గ్యారేజ్‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 2016లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వ‌సూళ్ల ప‌రంగా భారీ స్థాయిలో అంచ‌నాలు అందుకుంది. ఏకంగా 79.2కోట్లు రాబ‌ట్టుకుంది.


బాహుబలి 2: ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన  "ది బిగినింగ్"కి కొనసాగింపుగా ``బాహుబలి 2 ది కన్ క్లూజన్`` 2017లో విడుద‌ల అయింది. ఈ చిత్రం విడుదలై తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మ‌రియు తెలుగు వెర్ష‌న్‌లో ఏకంగా 325కోట్లు ద‌క్కించుకుంది.


రంగస్థలం: సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెరకెక్కిన సినిమా `రంగ‌స్థ‌లం`. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టించింది. మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బాగా అల‌రించింది. 125 కోట్ల షేర్ రాబ‌ట్టుకుని  ప్రపంచ వ్యాప్తం గా రికార్డులు సృషించింది.


F2: దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ ప్ర‌ధాన పాత్ర‌లు. 2019లో సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన `F2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్` అంద‌రిని ఎంత‌గానూ ఆక‌ట్టుకుంది. వ‌సూళ్ల ప‌రంగా ఏ మాత్రం త‌గ్గ‌కుండా 79 కోట్లు సాధించింది.


మహర్షి: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019 లో విడుదలైన `మ‌హర్షి` థియేట‌ర్స్‌లో ఇప్ప‌టికీ న‌డుస్తూనే ఉంది. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే క‌లిసి న‌టించిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇటు వ‌సూళ్ల ప‌రంగా కూడా మంచి రేసులో ఉంది. ఇక రాబోయే సాహో, సైరా సినిమాలు కూడా వినూత్న రికార్డులు క్రియేట్ చేస్తాయ‌ని తెలుస్తోంది



మరింత సమాచారం తెలుసుకోండి: