సీనియ‌ర్ హీరో అయిన అక్కినేని నాగార్జున దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా సిపీ ఇండస్ట్రీలో ఉన్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా ఎన్నో సినిమాలు చేసి బాక్సాఫిస్ వ‌ద్ద మంచి హిట్లు కొట్టారు. వయసు పెరుగుతున్నా గ్లామర్ మాత్రం అదే స్థాయిలో కంటిన్యూ చేస్తు సినిమాలు చేస్తున్నారు. ఇక తాజాగా నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా మ‌న్మ‌థుడు 2. ఈ సినిమా ఆగ‌ష్టు 9వ తేదీ రిలీజ్ కానుంది.


యువహీరోల నడుమ ఈ ఓల్డ్‌ హీరో ఇంకా రొమాంటిక్‌ పాత్రలు చేస్తూ దూసుకెళుతున్నారు. అయితే ఈ సినిమాకు మ‌న్మ‌థుడు సీక్వ‌ల్‌గా రావ‌డం, ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాలు, నాగార్జున రొమాంటిక్ క్రేజ్, ముందుగా రీలిజ్ అయిన టీజ‌ర్ల గుడ్ టాక్ ఇలా ఎన్నో ప్ల‌స్ పాయింట్లు ఉన్నా మ‌న్మ‌థుడు 2 ఏపీలో కేవ‌లం 7 కోట్ల రేషియోలో అమ్మ‌డం విశేషం. అయితే ఆయ‌న‌ మార్కెట్ త‌క్కువ అనుకోవ‌డానికి ఛాన్స్ లేదు.


దీని వెన‌క చాలా క‌థే ఉందంటున్నారు. ఎక్కువ‌ రేట్ల‌కు బ‌య‌ర్ల‌కు అమ్మి ఇబ్బంది ప‌డ‌డం కంటే త‌క్కువ రేట్ల‌కు అమ్మాల‌న్న కోణంలోనే నాగార్జున స‌ల‌హా మేర‌కు ఇలా అమ్మార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి  ఇటీవ‌ల‌ ట్రయిలర్ విడుదల ఫంక్షన్ లో తానే తక్కువ రేట్లకు ఇవ్వమన్నానని, నిర్మాతే కాదు, బయ్యర్లు కూడా బాగుండాలని చెప్పారు. ఎక్కువ‌ రేట్ల‌కు అమ్మి..  సినిమా డిజాస్టర్ అయితే బ‌య్య‌ర్లు మునిగిపోవ‌డంతో సినిమాకు నెగిటివ్ అవుతుంది. 


ఇక రైట్స్ త‌క్కువకు ఇస్తే బయ్యర్లు సేఫ్ అవుతారు, సినిమాకు నెగిటివ్ ఎక్కువ రాకుండా ఉంటుంది అన్న కోణంలో ఇలా చేశార‌ని తెలుస్తోంది. అలాగే యూత్‌లో క్రేజ్ ఉన్న విజయ్ డియర్ కామ్రేడ్ కూడా ఇదే ఫాలో అయిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల రూల్స్ మార‌డంతో ఎక్కువ రేట్ల‌కు అమ్మి న‌ష్టాలు వ‌స్తే ఆ న‌ష్టాన్ని మ‌ళ్లీ నిర్మాత‌లే భ‌రించాలి. నాగ్ ఆ రిస్క్ లేకుండా ముందుగా ఇలా చేశాడ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: