సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ లో కోట్లు గణిస్తాడు. ఒక విధంగా చూస్తే మహేష్ కు సినిమాల వల్ల వచ్చే ఆదాయం కన్నా తన బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ వల్ల ఆదాయం ఎక్కువ అన్న అంచనాలు కూడ ఉన్నాయి.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో మహేష్ తన పేరు మీద ఒక రెడీమేడ్ గార్మెంట్ ప్రోడక్ట్ ను లాంచ్ చేయబోతున్నాడు అంటూ వార్తలు రావడంతో విజయ్ దేవరకొండ ఛార్మీ అభిమానులు మహేష్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాను నటించే ఒకొక్క సినిమాకు 20 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తున్న మహేష్ స్థాయికి ఇలాంటి చిన్నచిన్న గార్మింట్ బిజినెస్ లు ఆన్ లైన్ వ్యాపారాలు అవసరమా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడంతో ఛార్మీ ఇలా రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ ను విజయ్ దేవరకొండ ఇంకా టాప్ హీరోగా సెటిల్ కాలేదు కాబట్టి ‘రౌడీ గార్మెంట్స్’ ను పెట్టినా అర్ధం ఉంది కానీ మహేష్ స్థాయికి ఇలాంటి బిజినెస్ లు ఏమిటి అంటూ అంటూ జోక్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ లాంటి టాప్ హీరో కొన్ని వందల మందికి ఉపాది కలిగించే బిజినెస్ లు చేయాలి కాని ఇలా చిన్నచిన్న బిజినెస్ లు ఏమిటి అంటూ ప్రశ్నలు కూడ వేస్తున్నారు. 

అయితే ఈ కామెంట్స్ ను పట్టించుకోకుండా మహేష్ తన ఎపరల్స్ బ్రాండ్ విషయంలో చాల వేగంగా ముందడుగులు వేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ బ్రాండ్ ఇమేజ్ తో విడుదల చేయబోయే టి.షర్ట్స్ డిజైన్ చేయడానికి ముంబాయికి చెందిన ఒక గార్మెంట్ డిజైనర్ ఇప్పటికే రకరకాల మోడల్స్ తో డిజైన్స్ వేస్తున్నట్లు సమాచారం. మహేష్ గార్మెంట్స్ బ్రాండ్ ను త్వరలో సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా హైదరాబాద్ లో జరగబోయే ఒక ఫ్యాషన్ షోలో లాంచ్ చేయబోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: