కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా నటించిన ‘ కేజీఎఫ్ ’ సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ నాలుగు సంవత్సరాలు కష్టపడి తీశారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీలో యష్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు తెగ ఫిదా అయ్యారు. అంతే కాదు యష్ కి టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు.  మూవీ రిలీస్ సందర్భంగా టాలీవుడ్ కి వచ్చిన యష్ తనపై  ఇంత ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కేజీఎఫ్ ఫ‌స్ట్ పార్ట్ బాక్సాఫీసు వ‌ద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇక రెండవ పార్ట్‌ను కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. కేజీఎఫ్ ఫ‌స్ట్ పార్ట్  ఇప్పటికే రూ.250 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది.  కన్నడ నాట ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన యష్ ఈ మూవీతో స్టార్ హీరోగా ఎదిగాడు.   కేజీఎఫ్ ఫ‌స్ట్ పార్ట్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కూడా మొదలు పెట్టి షూటింగ్ చక చకా కానిచ్చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తుండగా...తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సంజ‌య్ ద‌త్ స్పెష‌ల్ రోల్ ప్లే చేయ‌నున్నాడు. అధీర్ పాత్ర‌లో ద‌త్తు భాయ్ అద‌ర‌గొట్ట‌నున్నాడు. అయితే ఆ రోల్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను నిర్మాత‌లు రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా మాఫియా నేపథ్యంలో సాగుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు.  గతంలో పలు మాఫియా సినిమాల్లో నటించిన సంజయ్ దత్ ఈ మూవీలో అద‌ర‌గొట్ట‌నున్నాడు.

తాజాగా సంజయ్ దత్ నటించిన అధీర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్  నిర్మాత‌లు రిలీజ్ చేశారు. సంజ‌య్ ద‌త్త్ త‌న ట్విట్ట‌ర్‌లో ఆ లుక్ ఫోటోను రిలీజ్ చేశారు. కేజీఎఫ్ రెండ‌వ పార్ట్‌ను ప్ర‌శాంత్ నీల్ డైరక్ట్ చేస్తున్నాడు. మరి ఈ పాత్రలో సంజయ్ దత్ లుకింగ్ ఎలా ఉండబోతుంది..విలన్ గా చేస్తున్నాడా..లేక హీరోకి సపోర్టింగ్ క్యారెక్టారా అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: