“నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా”.. అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ పలికిన డైలాగ్ అప్పట్లో పేలిపోయింది. తెలుగులో అలాంటి భారీ ట్రెండ్ ను సృష్టించిన ‘మగధీర’ ఓ చరిత్రనే లిఖించింది. 2009 జూలై 31న విడుదలైన ఈ మెగా గ్రాండ్ బ్లాక్ బస్టర్ నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. అద్భుతమైన దృశ్యకావ్యంగా తెలుగు సినిమా గమనాన్నే మార్చేసింది. 78ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని కలెక్షన్లతో బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసింది. రెండో సినిమాతోనే అద్భుతమైన రికార్డులు సాధించి చిరంజీవి నట వారసత్వాన్ని ఘనంగా చాటాడు చరణ్. ప్రజారాజ్యం ఓటమితో ఆ ఏడాదిలో డీలా పడ్డ మెగా ఫ్యాన్స్ కు భారీ జోష్ ని ఇచ్చింది “మగధీర”.

 

  • మగధీరను 42 కోట్లు ఖర్చు పెట్టి తీశారు. 2004లో 25కోట్లతో తీసిన మెగాస్టార్ సినిమా అంజి మాత్రమే అప్పటి వరకు హై బడ్జెట్ మూవీ.


  • తెలుగులో 100 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఒక్క తెలుగులోనే 78 కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఇండస్ట్రీ లెక్కల్ని తిరగరాసింది. రెస్టాఫ్ ది ఇండియా కలెక్షన్లతో 87 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ సొత్ ఇండియా హిట్ గా నిలిచింది.  


  • అప్పటి వరకూ ఉన్న పోకిరి రికార్డులను డబుల్ ప్రాఫిట్ తో దాటేసింది. నైజాంలో పోకిరి 11.70 కోట్లు వసూలు చేస్తే మగధీర 24.80 కోట్లు వసూలు చేసింది.


  • విడుదలైన 5 వారాల తర్వాత కూడా హైదరాబాద్ లో ఈ సినిమాకు 25 ధియేటర్లు పెంచారు.


  • 286 సెంటర్లలో 50 రోజులు, 223 సెంటర్లలో 100 రోజులు ఆడి.. కర్నూలులో షిఫ్టులతో 1001 రోజులు ఆడి చెరగని రికార్డులను సృష్టించింది.


  • కథలో భారీతనం, నిర్మాత సాహసం, రాజమౌళి ప్రతిభతో ఓ ప్రభంజనాన్నే సృష్టించింది.  


  • చరణ్ హార్స్ రైడింగ్ సీన్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, 100 మెన్ ఫైట్.. ఈ సినిమాకు హైలైట్స్


  • తెలుగులో 40కోట్ల బడ్జెట్ పరిధి దాటి సినిమాలు రావడం మగధీరతోనే ఆరంభమైంది.


  • ఈ సినిమాతో మగధీరకు ముందు ఆ తర్వాత అంటూ.. రాజమౌళి తీసే సినిమా లెక్కలే మారిపోయాయి.


  • ఈ సినిమా సాధించిన 78కోట్ల షేర్ ను 2013లో అత్తారింటికి దారేది 81కోట్లతో దాటింది. బాహుబలి-1 వచ్చే వరకూ రెస్టాఫ్ ది ఇండియా 87 కోట్ల షేర్ పదిలంగా ఉంది.


  • రెండు నేషనల్ అవార్డులు, 9 నంది అవార్డులు, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు అవార్డులు సాధించింది.


  • రీసెంట్ గా ఈ సినిమా జపాన్ లో దేశంలో కూడా విడుదలై హిట్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: