టాలీవుడ్‌లోకి నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి ఎప్పుడూ క‌ష్ట‌ప‌డుతుంటాడు. జయ జానకి నాయక మాత్రం ఓ మొస్త‌రుగా ఆడింది. ఆ  తర్వాత సరైన సక్సెస్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం, గ‌త‌ యేడాది చేసిన ‘కవచం’తో పాటు రీసెంట్‌గా తెరకెక్కిన ‘సీత’ తో ఆడియన్స్‌ను మెప్పించ లేకపోయాడు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ కెరీర్ ప్రారంభంలోనే వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను వంటి పెద్ద దర్శకులతో పనిచేసిన ఈ హీరో.. గుర్తుండిపోయే విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 


మాస్ హీరోగా ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా ఆదరణ లభించడంలేదు.  అయినప్పటికీ శ్రీనివాస్ స్పీడు తగ్గించడంలేదు. వరసపెట్టి సినిమాలు చేస్తూనే వ‌స్తున్నాడు. రీసెంట్‌గా  తమిళంలో హిట్టైన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు రమేష్ వర్మ ద‌ర్శ‌క‌త్వం అందించారు. సైకో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర టీజర్ ఇంట్రస్టింగ్‌గా ఉండ‌డంతో అంచ‌నాలు బాగానే ఉన్నాయి.


కోలీవుడ్‌లో రాచ్చ‌స‌న్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా అక్క‌డ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇక్క‌డ దాన్ని మ‌క్కికి మ‌క్కిగా దించిన‌ రాక్ష‌సుడు కూడా హిట్ అవుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా బజ్‌ లేదు. అయినా కూడా చిత్రం సినీ వర్గాల్లో మంచి అంచనాలను కలిగి ఉంది. రీమేక్‌ అయినప్పటికి ఈ చిత్రం బిజినెస్‌ భారీగా జరిగింది. అనూహ్యంగా ఈ చిత్రం 20 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందితే అన్ని రకాల బిజినెస్‌ల ద్వారా నిర్మాత ఖాతాలోకి ఏకంగా 35 కోట్ల వరకు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
`రాక్ష‌సుడు` ప్రీ రిలీజ్ బిజినెస్:
నైజాం : 5.5 కోట్లు
సీడెడ్‌ : 2 కోట్లు
వైజాగ్‌ : 1.5 కోట్లు
ఈస్ట్‌ : 95 లక్షలు
వెస్ట్‌ : 85 లక్షలు
కృష్ణ : 1 కోట్లు
గుంటూరు : 1.2 కోట్లు
నెల్లూరు : 50 లక్షలు
కర్ణాటక : 1.1 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 70 లక్షలు
ఓవర్సీస్‌ : 70 లక్షలు
శాటిలైట్‌ రైట్స్‌ : 6 కోట్లు
హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ మరియు ప్రైమ్‌ వీడియో రైట్స్‌ : 12.5 కోట్లు
ఇతర ఏరియాలు : 50 లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: