ఆమె అందాన్ని అద్దం చూసింది. అసూయ పడింది. దాన్ని అందరికీ పంచాలనుకుంది. అంతే సెల్ఫీ కెమెరా కన్ను కొట్టింది. ఒక్కసారిగా సొగసు సోయగాలు విరబూసాయి. సౌందర్య ప్రేమికుల కళ్ళకు పని చెప్పేలా అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించాయి. చూసిన  కళ్ళు రెండూ తరించాయి. పెదవులు ఆ పేరుని పలవరించాయి. ఆమె ఎవరో కాదు. మాళవికా శర్మ. అందం, చందం అన్నీ ఉన్న ముద్దు గుమ్మ.


ఆమె నేల టికెట్ మూవీలో రవితేజాతో నటించింది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. దాంతో ఇంతందం ఉన్నా ఏం లాభం. పిసరంత లక్ లేదే. అందుకే ఆఫర్లు లేవంటే లేవు. అయితే మధ్యలో  ఓ రెండు బిగ్ ప్రాజెక్టులే వచ్చాయట. ఎందుకో అవి కూడా చివరి నిముషంలో చేజార‌డంతో ఇల నుంచి నేలకు దిగివచ్చిన మాళవికా శర్మకు  తీరని నిరాశే మిగిలింది. అయినా ఆమె తనకంటూ ఓ రోజు వస్తుందని గట్టిగా నమ్ముతోంది.


అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. ఇపుడు ఆమెకు సరైన డయాస్ సోషల్ మీడియావేనట. అక్కడ అందాల ఆరబోతను స్వేచ్చగా చేస్తోంది.  నచ్చిన వారిని ఫాలోవర్స్ గా చేసుకుంటోంది. హద్దూ పద్దూ లేని అందాలను ఆరేస్తూ యువ గుండెల్లో అలజడి రేపుతోంది. నేనున్నాను సుమా అంటూ సినిమా ఫీల్డ్ కి కూడా సంకేతాలు పంపుతోంది. లేటెస్ట్ గా మాళవికా శర్మ ఏకంగా వాష్ రూం లోనే తన అందానికి పదును పెట్టింది. మిర్రర్ లో తన రూపాన్ని సెల్ఫీ తీసి జనాల మీదకు వదిలింది.


ఇపుడు సోషల్ మీడియాలో కెవ్వు  కేక అన్నట్లుగా  సీన్ తయారైంది. ఏకంగా హాఫ్ మిలియన్ మంది ఫాలోవర్స్ ఈ హట్ పిక్  చూసి తరించేశారు. మాళవికా మేము తాళమిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చిలిపిగా పెడుతున్నారు. మరి మాళవిక సోషల్ మీడియాలో బిగ్ హీరోయిన్. వెండి తెర ఆమెను ఎపుడు పిలుస్తుందో. టాలీవుడ్ మీద కన్నేసి గట్టిగా ట్రై చేస్తున్న ఈ అమ్మడుకు అవకాశం వస్తే చాలు కుమ్మేస్తానంటోంది.  మాళవికకు మంచి రోజులు వస్తాయా.. ఏమో టాలీవుడ్ నే అడగాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: