భారత దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకులు మన ఇండస్ట్రీలో చాలా తక్కువమందే ఉన్నారు. వాళ్ళలో శంకర్ ఒకరు. ఆయన చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పటికి 26 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. దర్శకుడిగా ఆయన తెరక్కెక్కించిన మొదటి సినిమా “జెంటిల్ మెన్”. ఈ సినిమా 1993 జులై 30న విడుదలై ఒక సంచలనం  సృష్టించింది. అప్పటి వరకు యాక్షన్ కింగ్ అర్జున్ కి లేనటువంటి గొప్ప క్రేజ్ ని ఈ సినిమా తెచ్చిపెట్టింది. తమిళంలోనే కాదు తెలుగులోను ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో శంకర్ దర్శకత్వం వహించింది కేవలం 14 సినిమాలు మాత్రమే. కానీ ప్రతి సినిమా ఓఅద్భుతం, దేనికదే ప్రత్యేకం. ఒక్కో సినిమాని చూసిన ప్రేక్షకులు గానీ, ఇండస్ట్రీ వర్గాలు గానీ ఒక సినిమాని ఇలా కూడా తీయ్యోచ్చా అన్న సందేహంలో ఉండిపోయారు. అందుకు ముఖ్య కారణం శంకర్ కి ఉన్న వినూత్నమైన ఆలోచనా ధోరణి.

ప్రత్యేకంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ప్రధానంగా సాగే కథకి కమర్షియల్ అంశాలు జోడించి సినిమాలు చేయడం అనే ఇక కొత్త ట్రెండ్ ని దర్శకుడు శంకర్ పరిచయం చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోస్ సోషల్ మెస్సేజ్ సినిమాలలో నటించేవారు కాదు. దానికి కారణం వాళ్ళ స్టార్ డమ్, ఇమేజ్ అలాంటి సినిమాలకు సరిపడదనే ఆలోచనతో ఉండేవారు. అందుకు భిన్నంగా స్టార్ హీరోలతో సోషల్ మెస్సేజ్ సినిమాలు తీసి శంకర్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. జెంటిల్ మెన్, భారతీయడు, ఒకేఒక్కడు, అపరిచితుడు, రోబో, స్నేహితుడు.. దాదాపు ఆయన చేసిన అన్ని సినిమాలన్నీ పక్కాగా సామాజిక స్పృహ కలిగినవి కావడం విశేషం. 

ఆయన తీసిన పద్నాలుగు సినిమాలలో దాదాపు అన్ని బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ సాధించినవే. విక్రమ్ హీరోగా చేసిన ప్రయోగాత్మక చిత్రం "ఐ", జయ్ హీరోగా వచ్చిన 'స్నేహితుడు' సిద్ధార్థ-జెనీలియా తో వచ్చిన బాయ్స్..సినిమాలు మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఆయన లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా
 'భారతీయుడు - 2'  సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: