స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం  సరైనోడు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 70కోట్ల షేర్  వసూళ్లను రాబట్టి  బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. గీతా అర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా థమన్ సంగీతం అందించాడు. 


ఇక ఈ చిత్రం తాజాగా  తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పట్లో దాదాపు ఎవరికి సాధ్యం కాని రికార్డు ను సృష్టించింది.  ఈసినిమా యొక్క  హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ను   గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఆ తరువాత హిందీ వెర్షన్  ను యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయగా  అతి తక్కువ సమయంలో 170 మిలియన్స్ వ్యూస్ ను రాబట్టి  కొత్త రికార్డు సృష్టించింది. ఒక టాలీవుడ్ సినిమా కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం అదే తొలిసారి. ఆ తరువాత ఎందుకో తెలియదు కానీ సినిమా ను యూ ట్యూబ్ నుండి తొలగించారు. 


అయితే కొద్దీ రోజుల క్రితం  మళ్ళీ అప్ లోడ్ చేయగా  ఈరోజుతో 200మిలియన్స్ వ్యూస్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇప్పటికి ఆ సినిమా కు అక్కడ క్రేజ్ తగ్గలేదు.  నార్త్ లో ఈ రేంజ్ లో  వ్యూస్ ను రాబట్టిన టాలీవుడ్ సినిమా కూడా ఇదే.  ఇప్పట్లో ఈ రికార్డు ను బ్రేక్ చేయడం అసాధ్యం.  కాగా   తెలుగు తో పాటు మలయాళం లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న అల్లు అర్జున్ ఈ సరైనోడు తో ఫ్యాన్ ఇండియన్ యాక్టర్ గా మారారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: