తెలుగులో కొంతమంది హీరోయిన్లకు లాంగ్ కెరీర్ ఉంటుంది. మరికొందరికి షార్ట్ స్పాన్ మాత్రమే ఉంటుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా యూత్ కి కనెక్ట్ అవుతూనే ఉంటారు. అటువంటి వారి కోవలోకి చెందిన భామ శ్రద్ధా దాస్. 2008లో అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 

ఆ సినిమాతో గ్లామర్ బాగా పండించడంతో కేవలం ఆరు నెలలోనే నాలుగు సినిమాలకు సంతకం చేసింది. జగపతి బాబుతో అధినేత, డైరీ, డార్లింగ్, నాగవల్లీ, రేయ్, బందిపోటు మొదలైన సినిమాల్లో నటించింది. ఆమె సైన్ చేసిన పెద్ద సినిమాల్లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆర్య 2 మాత్రమే. ఆసినిమాతో గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ మధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ లో నటించి మూవీ లవర్స్ ను మెప్పించింది. ఆ సినిమాలో ఆమె నటన, హావభావాలు కొంచెం సెక్సీగా ఉంటాయి. సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఆమె చేసిన ఓ ఫోటో షూట్ యవతను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఫుల్ వైట్ డ్రెస్ లో ఉన్న ఆమె ఇచ్చిన స్టిల్స్ చాలా హాట్ గా ఉన్నాయి.

 

ఈ ఫోటోలకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఉంచింది. ‘ఆకాశం నుంచి దిగివచ్చిన చందమామ’ ‘స్టన్నింగ్ బ్యూటీ’ అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. భారీగా లైక్ లు కూడా వచ్చాయి. ముంబయికి చెందిన శ్రద్ధా పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది. పలు కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: