దర్శక ధీరుడు  రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా   రాబోతున్న  భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'  ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది. ఇద్దరి  హీరోల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా  తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక  ఈ చిత్రాన్ని 2020 జూలై 30 కల్లా ప్రేక్షకుల ముందు ఉంచుతానని రాజమౌళి మూవీ లాంచ్ చేసిన ఈవెంట్ లోనే ప్రకటించారు.  కానీ ఆ తర్వాత మాత్రం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరికీ గాయాలు కావడం వల్ల షూటింగ్ చాలా కాలం వాయిదా పడాల్సి వచ్చింది.  దీనితో విడుదల తేదీ వాయిదా పడుతుందని అభిమానులు అంతా భావించారు.  కానీ  విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేకుండా.. అనుకున్న డేట్ ప్రకారమే షూటింగ్ అయ్యేలా  వర్కింగ్ డేస్ లో  పగలు  రాత్రి అంటూ తేడా  లేకుండా షూట్ చెయ్యటానికి రాజమౌళి ప్లాన్ చేశారట. ఇటివలే హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ అలాగే సుమారు పది రోజులు ప్లాన్ చేసుకుని వెళ్తే.. అది కేవలం ఏడు రోజుల్లోనే పూర్తి చేసాడట. మొత్తానికి రాజమౌళి సినిమాని మాత్రం అనుకున్న తేదీకే విడుదల అయ్యేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.   


ఈ చిత్రం పై ఎన్ని అంచనాలు ఉన్నాయో మనం కొత్తగా చెప్పుకొనక్కర్లేదు. ప్రపంచం అంతా తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసిన బాహుబలి లాంటి సినిమా తీసిన రాజమౌళి.. మళ్లీ బాహుబలిని మించే స్థాయిలో  ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా విజువల్స్ పరంగా.. ఎమోషనల్ పరంగా  అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు.    ధృడంగా ఉండే  కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు ఇంకా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్   స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేస్తునే ఉన్నాడు.  కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.  డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.  జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.   


కాగా  ఆర్‌ఆర్‌ఆర్ తదుపరి ప్రధాన షెడ్యూల్ పూణేలో జరగాల్సి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ ను పూణేలో క్యాన్సల్ చేశారట. పూణే బదులు  తమిళనాడులో ఈ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు. అక్కడ ఈ నెల 11వ తేదీ నుండి  ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: