టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో సినిమా మేనియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతంగా మారుమ్రోగుతోంది. ఈ సినిమా టీజర్ మరియు రెండు వీడియో ప్రోమో సాంగ్స్ చూసిన తరువాత, అసలు ఇది ఇండియన్ సినిమానా లేక హాలీవుడ్ సినిమానా అంటూ పలువురు ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు. ఇక తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాను ఆయా భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు, అంతేకాక అన్ని భాషల్లోనూ ఈ సినిమా బిజినెస్ కూడా ఎంతో అద్భుతంగా జరిగిందట. 

ఏ మాత్రం సినిమాకు హిట్ టాక్ వచ్చినా చాలు, ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలవడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక దాదాపుగా రూ.300 కోట్ల పైచిలుకు భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ సాహో సినిమాకు ప్రభాస్ ఏకంగా రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్తున్నట్లు నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే అది కేవలం డబ్బు రూపేణా మాత్రమే కాక, కొంత సినిమా లాభాల్లో వాటా రూపంగా కూడా తీసుకోవాలని ప్రభాస్, సాహో నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారట. నిజానికి బాహుబలి సిరీస్ రెండు సినిమాలు దేశ, విదేశాల్లో కూడా అత్యద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడంతో ప్రభాస్ కు ఇంతటి రేంజి మార్కెట్ వచ్చిందనేది తెలిసిందే.

ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా సాహో కు నిజంగానే రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ కనుక తీసుకున్నట్లైతే ఇది కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, యావత్ భారత దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా ప్రభాస్ ముందు స్థానంలో నిలుస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రనిజకాంత్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటివారికి రూ.75 కోట్లవరకు డబ్బు మరియు సినిమా లాభాల రూపంలో రెమ్యూనరేషన్ గా లభిస్తోందట. మరి ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే సాహో టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: