నందమూరి కళ్యాణ్ రామ్  హీరోగా వచ్చిన లాస్ట్ ఫిల్మ్  '118' చిత్రం  బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకోవడంతో.. ఇక కళ్యాణ్ రామ్  వరుసగా  సినిమాలు అంగీకరిస్తూ.. ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేస్తోన్న హీరోగా  దూసుకువెళ్తున్నాడు.  ప్రస్తుతం  నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్  దర్శకత్వంలో రానున్న ఓ   సోషియో ఫాంటసీలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకి చిత్రబృందం 'రావణ' అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఇక సినిమాతో పాటు  ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కూడా ఓ సినిమా  చేస్తున్నాడు.  ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తుంది.  కళ్యాణ్ రామ్ 17వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి "ఎంత మంచివాడవురా" అనే క్లాసిక్ టైటిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.    


అలాగే  డైరెక్టర్ సంపత్ నంది ఇప్పటికే  కళ్యాణ్ రామ్ కోసం ఓ మంచి కామెడీ  ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడు.  త్వరలోనే ఈ సినిమా  పట్టాలెక్కెనున్నట్లు తెలుస్తోంది.  అయితే పటాస్ తరువత కామెడీ చిత్రాలు  పెద్దగా చేయని కళ్యాణ్ రామ్, సంపంత్ నంది  సినిమాలో  మాత్రం పక్కా కామెడీ అంశాలు హైలెట్ అయ్యే విధంగా సినిమాని చేయనున్నాడట. మరి ఎక్కువుగా సీరియస్ పాత్రలు చేసే కళ్యాణ్ రామ్   ఫుల్ ఎంటర్ టైనర్ లో ఫుల్ కామెడీ రోల్ చేయనున్నాడు.   సినిమా మొత్తం మీద కళ్యాణ్ రామ్  పాత్రలో చాలా వేరియేషన్స్  ఉంటాయట.  ఆ పాత్రలోని  వేరియేషన్స్ వల్లే  సినిమాలో  కామెడీ సీక్వెన్స్  హైలెట్ గా నిలుస్తాయట.  మరి కళ్యాణ్ రామ్ - సంపత్ నంది కాంబినేషన్ లో వస్తోన్న  ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కి  మంచి  హిట్ ఇస్తోందేమో చూడాలి. 


అదేవిధంగా కళ్యాణ్ రామ్ మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలకు పని చేసిన శేష్ అనే యువ దర్శకుడికి కూడా కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇచ్చాడట. శేష్ చెప్పిన కథ చాలా బాగుందట. అందుకే కళ్యాణ్ రామ్ వెంటనే  సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు  తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేస్తోన్న హీరోల్లో నెం.1 కళ్యాణ్ రామే !   


మరింత సమాచారం తెలుసుకోండి: