మెగా అభిమానులంతా  సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా అమితాబ్  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  ఇలా  ప్రతీ ఒక్క ఇండస్ట్రీకు సంబంధించి అగ్ర నటులంతా ఈ సినిమాలో కనిపించడంతో  సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఆ స్థాయిలో చేయడంలేదేమో అనిపిస్తోంది.  ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఈ నెల 15 మరియు 16 తేదీలలో జరగబోయే సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో  విడుదల చేస్తున్నారట.  అయితే ఈ విషయంలో ఒకసారి మళ్ళీ  సైరా టీం ఆలోచిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఒక విధంగా   సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో సైరా  ట్రైలర్ ను రిలీజ్  చెయ్యడం గొప్పగానే ఉంటుంది గాని.. ఎప్పుడో విడుదల తేదీని పెట్టుకుని  అప్పుడే ట్రైలర్ కనుక విడుదల చేస్తే.. మరి సినిమా విడుదల సమయానికి  ఒక నెలకు పైగా గ్యాప్ ఉంటుంది.


ముందే ట్రైలర్ వదిలితే.. విడుదల సమయంలో భారీ స్థాయిలో చేసే ప్రమోషన్స్ ఏమి ఉండవు. పైగా ఎంత ఆర్భాటంగా ప్రమోషన్స్ చేసినా సరే   పెద్ద ఇంపాక్ట్ కూడా  ఉండదు.  అందువల్ల ట్రైలర్ ను విడుదలకి  రెండు వారాలు సమయం ఉందనగా  విడుదల చేసినట్టయితే..  ఉన్న అంచనాల కన్నా మరిన్ని అంచనాలు  ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.  బాహుబలి విషయంలో రాజమౌళి కూడా ఇలాంటి టైపు ప్రమోషన్స్ నే చేశాడు. అసలు ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ప్రమోషన్స్ విషయంలో ఎంత ముందు చూపు ఉండాలి. ఎందుకో ఆ విషయంలో సైరా టీం పూర్తిగా వెనుకపడండి. తన తండ్రి సినిమా కావడంతో ఈ చిత్రానికి నిర్మతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ కూడా ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు గాని, అంతే స్థాయిలో ప్రమోట్ చెయ్యలేకపోతున్నాడు.  ప్రమోషన్స్ విషయంలో చరణ్,  రాజమౌళిని ఫాలో అయితే సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: