మిషన్ కాశ్మీర్ అంశం తరువాత మిషన్ అనే పదానికి గౌరవం పెరిగింది.  మిషన్ అనే ట్యాగ్ యాడ్ చేస్తున్నారు అంటే దానికి స్పీడ్ గా కంప్లీట్ చేయబోతున్నారని, పక్కా ప్రణాళికతో చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.  సినిమాల విషయంలో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు.  సల్మాన్ ఖాన్ హీరోగా దబాంగ్ సీరీస్ లో మూడో సినిమా దబాంగ్ 3 షూటింగ్ సెరవేగంగా జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు.  



దబాంగ్ 3 సినిమాను పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.  దబాంగ్ 3 సినిమాలో విలన్ గా శాండల్ వుడ్ హీరో కిచ్చ సుదీప్ చేస్తున్నారు.  సుదీప్ అయితేనే ఖచ్చితంగా న్యాయం చేయగలడన్న విశ్వాసంతో ఆయన్ను తీసుకున్నారు.  ఈగ సినిమా తరువాత ఈ హీరోకు డిమాండ్ పెరిగింది.  సుదీప్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట.  దబాంగ్ సీరీస్ లో ఇప్పటి వరకు విలన్ కు ఇచ్చిన పాత్రలకు ఇది భిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  



ఇక ఇందులో సుదీప్ తో పాటు టాలీవుడ్ కమెడియన్ ఆలీ కూడా నటిస్తున్నాడు.  దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  బాలీవుడ్ లో సల్మాన్ కు మాస్ ఇమేజ్ ఉన్నది.  ఆ ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు.  ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్. 


సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.  ఈ ఏడాది క్రిస్మస్ కు సినిమాను రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  అందుకోసమే వేగంగా షూట్ చేస్తున్నారు.  గత దబాంగ్ సీరీస్ లానే ఈ సినిమా కూడా ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే డిసెంబర్ 25 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: