ప్రభాస్ నటించిన  హై వోల్టేజ్  యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాహో 'గురించి  ఈ రోజు  చిత్ర నిర్మాణ సంస్థ  యువీ క్రియేషన్స్ సూపర్ అప్డేట్ ఇచ్చింది.  అందులో భాగంగా ఈనెల 10న  ఈచిత్రం యొక్క ట్రైలర్ విడుదలకానుందని అధికారికంగా ప్రకటించింది.  ఇక ఈనెల 30న  ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానున్న విషయం తెలిసిందే.  ఇక సాహో దెబ్బకు ఆ రోజు విడుదలకావల్సిన సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి.  కానీ ఒక్క నాని, గ్యాంగ్ లీడర్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.అయితే  ఈసినిమా  ఖచ్చితంగా వాయిదాపడుతుందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా నాని కూడా ఇదే విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు. 


సోషల్ మీడియా ద్వారా స్పందించిన నాని .. సాహో మన సినిమా కానీ దేశ వ్యాప్తంగా సౌండ్ చేస్తుంది ఈసినిమా బ్లాక్ బ్లాస్టర్ కన్న తక్కువ హిట్ కాకుకూడదు. ప్రభాస్ అన్న మరియు సాహో టీం కు అల్ ది  బెస్ట్ అలాగే గ్యాంగ్ లీడర్ విడుదల తేదీని రేపు ప్రకటిస్తామని.. ఓ  ప్రైవేట్ పార్టీ లో ప్రభాస్తో ఆయన  కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో ను షేర్ చేసాడు. 


ఇక గ్యాంగ్ లీడర్ సినిమాను సెప్టెంబర్ 13న కానీ , 20 న కానీ విడుదలచేయనున్నట్లు తెలుస్తుంది.  విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా , శరణ్య , లక్ష్మి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ సూపర్ రెస్పాన్స్ రాబట్టి  సినిమా ఫై అంచనాలను పెంచింది. 





మరింత సమాచారం తెలుసుకోండి: