పాపం నేచుర‌ల్ స్టార్ నాని క‌ష్టాలు మామూలుగా లేవు. ఈ స‌మ్మ‌ర్‌లో జెర్సీ సినిమాతో హిట్ కొట్టిన నాని గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోవాల‌ని క‌ష్ట‌ప‌డి మ‌రీ ఈ సిన‌మా చేశాడు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ముందుగా ఆగ‌స్టు 30న లాక్ చేసుకున్నారు. అయితే ఆగ‌స్టు 15న రావాల్సిన సాహో వాయిదా ప‌డి ఆగ‌స్టు 30న లాక్ అయ్యింది. 


సాహో కోసమని ఆగస్ట్‌ నెల మొత్తం మిస్‌ అయిన గ్యాంగ్‌ లీడర్‌ ఇప్పుడు సెప్టెంబర్‌ రెండవ వారంలో విడుదలకి సిద్ధమవుతోంది. అది గ్యాంగ్ లీడ‌ర్‌కు క‌రెక్ట్ డేట్ కూడా కాదు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా వాయిదా పడితే దసరాకి విడుదల చేద్దామని అనుకున్నారు. సైరా వాయిదా పడదని చిరంజీవి క్లీయ‌ర్‌గా చెప్పేశారు. సైరా వాయిదాపై వ‌స్తోన్న పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని క్లారిటీ ఇచ్చేశారు. 


ఇక చివ‌ర‌కు గ్యాంగ్ లీడ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 13న లాక్ చేసుకున్నారు. అయితే అదే డేట్‌కు మెగా హీరో వ‌రుణ్ తేజ్ వాల్మీకి కూడా వ‌స్తోంది. దీని వల్ల నాని సినిమాకి సోలో రిలీజ్‌ స్పాట్‌ దొరకడం లేదు. వాల్మీకితో నాని సినిమాకు పోటీ త‌ప్ప‌డం లేదు. ఈ రెండు సినిమాల నిర్మాత‌లు ఎవ‌రో ఒక‌రు వెన‌క్కు త‌గ్గుదామ‌ని మాట్లాడుకున్నా ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు నాని వ‌ర్సెస్ వ‌రుణ్‌తేజ్ మ‌ధ్య పోటీ త‌ప్ప‌డం లేదు.


టాలీవుడ్‌లో కొంద‌రు క్లాస్ లేకుండా సెటిల్మెంట్ చేయాల‌ని చేసినా అది ఫెయిల్ అయ్యింద‌ట‌. ఈ రెండు సినిమాల్లో వాల్మీకి త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించారు. గ్యాంగ్ లీడ‌ర్‌కు కాస్త బ‌డ్జెట్ ఎక్కువే. దీంతో వాల్మీకికే త్వ‌ర‌గా బ్రేక్ ఈవెన్ ఛాన్సులు ఉంటాయి. సడన్‌గా ఈ రెండు చిత్రాల క్లాష్‌ ట్రేడ్‌ ఆసక్తికరంగా మారింది. మరి ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: