ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. క‌థ క‌థ‌నం బావుంటే చాలు కొత్తవారినైనా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్న సంబంధం లేకుండా కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఇప్పుడు అదే కోవ‌కు చెందిన చిత్రం "రాహు"   . ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు అంద‌రూ కొత్త‌వారైనా స‌బ్జెక్ట్‌కు ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మిది.


కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.  కొత్త సబ్జెక్ట్స్ తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమా ని రివల్యూషనైజ్ చేస్తున్నారు; ఇది కూడా అలాంటి ఒక ప్రయత్నం అవుతుంది అని డైరెక్టర్  సుబ్బు అన్నారు. సుబ్బు న్యూయార్క్‌లో  చదువుకున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ అంటున్నారు. డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ - లక్కరాజు ఎడిటింగ్ - అమర్ రెడ్డి వంటి సాంకేతిక నిపుణుల సహకారంతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్‌ లో ఈ థ్రిల్లర్ సినిమా ఉండనుంది. 


ఇంకా ఈ చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం - సుబ్బు వేదుల, నిర్మాతలు - ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల, డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్ - అమర్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: