కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కొన్నేళ్ల క్రితం విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మధుడు సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. నాగ్ సరసన సోనాలి, అన్షు హీరోయిన్స్ గా నటించిన ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం అయింది. ఇక మళ్ళి ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు -2 ని యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించడం జరిగింది. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ చిన్న ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్, సినిమాపై అమాంతం విపరీతమైన అంచనాలు పెంచేసాయి. 

అయితే ఆ విధంగా విపరీతమైన అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలు అందుకోవడంలో చాలావరకు విఫలమైనట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు, అప్పటి మన్మధుడు సినిమాతో పోలిస్తే ఈ సినిమా అస్సులు నిలబడలేదని  తేల్చేస్తున్నారట. నాగ్ మరియు రకుల్ ల జోడి అద్భుతంగా ఉండడం, సినిమాలో నాగ్ ఎంతో యంగ్ గా అలానే స్టైలిష్ గా కనిపించడం ప్లస్ పాయింట్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా కథ మరియు కథనాల విషయంలో దర్శకుడు రాహుల్ మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేదని, అప్పటి మన్మధుడు లో పంచ్ డైలాగ్స్ అద్భుతంగా పేలితే, ఇందులో అవేవో కావాలని ఆ పాత్రలతో చెప్పించినట్లుందని ఎక్కువగా సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ విషయంలో ప్రేక్షకుడు పూర్తిగా నిరాశకు గురయ్యాడట. ఇక మన్మథుడు కు దేవిశ్రీ అందించిన సాంగ్స్, ఇప్పటికీ కూడా అక్కడక్కడా వినపడుతుంటాయంటే, 

ఆ సాంగ్స్ లోని ఫీల్ అర్ధం చేసుకోవచ్చని, ఈ సినిమాలో సాంగ్స్ సినిమాకు పూర్తి మైనస్ అని అంటున్నారట. అలానే సినిమాలో పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నా, కథ పాతది కావడంతో దానిని నేటి తరానికి తగ్గట్లు మార్చి కొత్తదనంగా చిత్రీకరించడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారట. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు చాలా చోట్ల నుండి ఒకింత ఈ విధమైన స్పందనే వస్తున్నట్లు చెప్తున్నారు. అయితే మొదటి రోజు టాక్ ని పూర్తిగా పరిగణలోకి తీసుకోలేం అని, కాబట్టి మరొక రెండు మూడు రోజలు గడిస్తేనే గాని, సినిమా పూర్తి టాక్ ని అంచనా వేయలేమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మన్మధుడు మున్ముందు ఎటువంటి టాక్ తో ఎంతటి కలెక్షన్ కొల్లగొడతాడో వేచి చూద్దాం....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: