నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మన్మథుడు2 సినిమా నిన్న విడుదలైంది. 2002 సంవత్సరంలో వచ్చిన నాగార్జున హిట్ సినిమా మన్మథుడు పేరుతో రావటంతో మన్మథుడు2 సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తొలి సినిమా చి ల సౌ తో హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించటం కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచింది. కానీ నిన్న విడుదలైన మన్మథుడు2 సినిమా ఆ అంచనాలు అందుకోవటంలో మాత్రం విఫలమైంది. 
 
మన్మథుడు2 సినిమాకు యావరేజ్ టాక్ రావటానికి నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోనే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్1 జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేయగా సీజన్1 సమయంలో జూనియర్ ఎన్టీయార్ జై లవకుశ సినిమాలో నటించాడు. జై లవకుశ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం జై లవ కుశ సినిమా యావరేజ్ ఫలితాన్నే అందుకుంది. 
 
బిగ్ బాస్ సీజన్2 హోస్ట్ చేసిన నాని సీజన్2 సమయంలో నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో విడుదలైన దేవదాస్ సినిమా కూడా క్రిటిక్స్, ప్రేక్షకుల నుండి యావరేజ్ ఫలితాన్నే అందుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్3 హోస్ట్ చేస్తున్న నాగార్జున మన్మథుడు2 సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా యావరేజ్ ఫలితాన్నే అందుకునేలా ఉంది. 
 
ఇలా బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న ముగ్గురు హీరోలకు హోస్ట్ చేస్తున్న సమయంలో నటించిన సినిమాలు యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాయి. మన్మథుడు2 సినిమా మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో మన్మథుడు2 సినిమా కలెక్షన్లు బాగానే నమోదు చేసే అవకాశం ఉంది. ఓవర్సీస్లో మాత్రం మన్మథుడు2 సినిమా కలెక్షన్లు తక్కువగానే నమోదు చేస్తోందని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: