గడచిన రెండు మూడేళ్ళ నుంచి టాలీవుడ్ సరికొత్త అడుగులు వేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ వెళుతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ అడుగులను తప్పటడుగులు వేసే దిశగా చేయిస్తున్నాయి.  టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా “కొబ్బరిమట్ట”.  స్టీవెన్ శంకర్  నిర్మాణంలో  ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. ఈ  నేపథ్యంలో ఈ సినిమా కేవలం  తెలుగు సినిమా స్థాయిని తగ్గించడానికే వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు మునుపే ఈ ఇద్దరి కాంబినేషన్లో “హృదయకాలేయం” అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వస్తున్న “కొబ్బరిమట్ట” సినిమా కూడా అదే పేరడీ కాన్సెప్ట్ తో వచ్చింది. పేరడీ అంటే లాజిక్ లెస్ సన్నివేశాలతో సెంటిమెంట్ పండే సన్నివేశాలను కూడా కామెడీ కోణంలో చూపించి సినిమా పై ఉండే గౌరవాన్ని తగ్గించారు.  అయినా ఇలాంటి సినిమాలను  ప్రేక్షకుడు తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది  కానీ,  కొన్ని మరీ అతి సన్నివేశాలను  చూస్తే మాత్రం సినిమా తీసిన డైరెక్టర్ ను, నటించిన హీరోను తిట్టకుండా ఉండలేం. 


మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా...  దారుణమైన అతి చేస్తూ..  చివరికి ఇరిటేట్ చేశారు.  ఇప్పటికే మనం ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో ఓవర్ యాక్షన్ సీన్లను చూసేసాం ఉన్నాం. అయినా  పెద్దగా బాగాలేదు సినిమా అని చెప్పి వదిలేస్తాం, కానీ ఈ  రొటీన్ రొట్ట సినిమాను చూసాక అస్సలు ప్రశాంతగా ఉండలేము.  అయినా ప్రస్తుతం సరికొత్త కాన్సెప్టులతో దర్శకులు టాలీవుడ్ తో  పాటు ఇతర భాషల సినీ పరిశ్రమల నుండి కూడా  మంచి పేరు తెచ్చుకుంటంటే..   ఇప్పుడు మళ్ళీ కొబ్బరిమట్ట టీమ్ ఇతర భాషల వారికి టాలీవుడ్ ను విమర్శించేందుకు అవకాశం ఇచ్చిన వారయ్యారు.  ఇప్పటికే సోషల్ మీడియా ప్రజానీకం కూడా ఈ సినిమాలోని సీన్స్ కి సంబంధించిన షాట్స్ ను  ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ఓవర్ సీన్లు  చెత్త కామెడీ చిత్రాలు ఇక మన వాళ్ళు  ఆపేస్తేనే టాలీవుడ్ కి మంచింది.  

  

దీనికీ తోడు ఈ సినిమాలో  సంపూర్ణేష్  బాబు  పాపారాయుడు,పెద్ద రాయుడు,యాండ్రాయుడు అనే  పాత్రలు నటించి ప్రేక్షకులకు  హాస్యాన్ని పండించడం ఏమో గాని, చిక్కటి చికాకును మాత్రం  తెరపై బాగా  పండించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: