అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా మన్మధుడు కి సీక్వెల్ గా తెరకెక్కిన మన్మధుడు – 2 నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల మధ్య పాజిటివ్ టాక్ సంపాదించలేకపోయిన ఈ చిత్రం ఆఖరికి ఇంట్లో వాళ్ళ మన్ననలు కూడా నోచుకోలేదు. వివరాల్లోకి వెళితే, ఇది వరకే నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమా ట్రెయిలర్ తన కోడలు సమంతకు అభ్యంతరకరంగా ఉందని, అందులో ఉన్న కొన్ని 'అడల్ట్ కంటెంట్' సీన్లు గురించి ఆయన ప్రస్తావించారు. సమంత కూడా ఈ చిత్రాన్ని లైట్ గానే తీసుకున్నట్లు ఉంది. అయితే తన సొంత మామ గారి చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ తరువాత కనీసం ఒక్క ట్వీట్ కానీ పోస్ట్ కానీ పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన సినిమా తరువాత ఆమె ఇంకా గరం అయినట్లు సమాచారం.


సినిమా లో ఝాన్సి, రకుల్ మధ్య లిప్ లాక్ సీన్ దగ్గర నుండి నాగ్ ను మెప్పించేందుకు రకుల్ పొగ త్రాగడం వరకు చాలానే మ్యాటర్ ఉందని సమాచారం. ఇవి చాలవన్నట్లు డబుల్ మీనింగ్ ఉండే సింగిల్ లైన్ డైలాగులు. సహజంగానే స్త్రీ వాది అయినా సమంతకు ఒళ్లు మండేoదుకు ఇవి చాలు. ఇప్పటికే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, బాలీవుడ్ లో మీ టూ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో ఇలాంటి సన్నివేశాలు ఎలా రీసీవ్ చేసుకుంటారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. 


కొసమెరుపు ఏంటంటే ఈ మధ్యనే అర్జున్ రెడ్డిలో ఈ లింగ బేధాలు, మెచ్యూరిటీ టాపిక్ మీద సమంత తో కలిసి ధ్వజమెత్తిన తన క్లోజ్ ఫ్రెండ్ అయిన చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. దీంతో నెటిజన్లు సినిమాలోని ఈ అసభ్యకర సన్నివేశాలు,మాటలు గురించి సమంతను వివరణ అడగడడం మొదలెట్టేశారు.  సమంత రిప్లై ఎలా ఉంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: