నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం 'మన్మధుడు 2'. ఆగస్టు 9న విడుదలైన ఈచిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటున్న నాగార్జున ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో  మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించి, తన కెరియర్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.


నా కెరియర్ మొత్తం కూడా కొత్తదన కోసం తపిస్తూ వచ్చాను, కొత్త కొత్త కథల్ని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకే రకమైన సేమ్ సినిమాలు చేయడం నాకు నచ్చట్లేదు, యూత్‌కు కూడా నచ్చడం లేదు. ఏదైనా కొత్తగా చేయాలని అప్పట్లో తొలిసారి గీతాంజలి కొత్తగా ట్రై చేశాం. అది కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిది. ఆ సినిమా రిలీజ్ అయినపుడు వెంటనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. కొంత టైమ్ తీసుకున్నారని నాగార్జున గుర్తు చేసుకున్నారు.


‘అన్నమయ్య' మూవీ అప్పట్లో వారం రోజులకే థియేటర్ల నుండి తీసేసే దశకు వచ్చింది. చాలా చోట్ల షేర్ రాక, థియేటర్ల రెంటు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఓ టూర్ వెళితే బావుంటుందని భావించాం. అయితే అది కూడా పెద్దగా పని చేయలేదు. ఊహించని విధంగా పదకొండవ రోజు మ్యాట్నీ నుంచి అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రజలు యాక్సెప్ట్ చేశారు.


గతంలో వచ్చిన మన్మధుడు సినిమా కూడా కొత్తరకం మూవీ కావడంతో కొత్తరకం స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగులు ప్రేక్షకులకు ఎక్కడానికి సమయం పట్టింది. దీన్ని మరోరకంగా రాయొద్దు. నాగార్జున ఈ చిత్రాన్ని ఒరిజినల్ మన్మధుడుతో కంపేర్ చేస్తున్నాడని దయచేసి భావించవద్దు. మన్మధుడు-౨ సినిమా కొత్తరకమైన సినిమా. ఈ సినిమాని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని, కాకపోతే దానికి కొంచెం టైం పడుతుందని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: