తెలుగు బుల్లితెర పై  ప్రేక్షకులు విశేషంగా  ఆకట్టుకుంటున్న షో  'బిగ్ బాస్'.  ముఖ్యంగా   ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన 'బిగ్ బాస్ 1' బుల్లి స్క్రీన్ పై ఏ రేంజ్ లో  ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు.  అయితే ఎన్టీఆర్ రేంజ్ అంచనాలతో  'బిగ్ బాస్ 2'  హోస్ట్ గా   వచ్చిన నాని,  ప్రేక్షకులను ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా  'బిగ్ బాస్ 3' మొదలు అయింది. మొత్తం 15 మంది పోటీదారులతో మొదలైన ఈ సీజన్ మొదటి నుంచే కాస్త రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇటీవలే వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయినటువంటి ఒక ట్రాన్స్ జెండర్ తమన్నా  బిగ్ బాస్ హౌస్ లో తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.  హౌస్ లో  తమన్నా వ్యవహార శైలి మరి దారుణంగా ఉందని.. తమన్నా  చేస్తోన్న  రచ్చ మాములుగా లేదని హౌస్ మేట్స్ అందరూ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినా తమన్నా గురుంచి ఎంత చెప్పుకున్నా  తక్కువనే చెప్పాలి.  అసలే గొడవల వాతావరణం ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్ లోకి తమన్నా ఎంటర్ అయ్యాకే గొడవలు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి.   తమన్నా సింహాద్రి ఎంటర్ అయ్యాక షో కూడా ఎవరూ ఊహించని విధంగా  కొనసాగింది.  వీటికి తోడు  తమన్నా చేసినటువంటి కొన్ని అసభ్యకరమైన వాఖ్యలు ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెట్టాయి.  ఎట్టకేలకు మూడవ ఎలిమినేషన్ గా తమన్నా సింహాద్రి  నేడు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది.  ఇక మొదటి వారంలో నటి హేమ ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారంలో ఒక జర్నలిస్టు జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. కాగా ఈ మూడవ వారంలో తమన్నా అవుతుందట.  


తమన్నా పోయాక  షోలో ఉన్న మిగిలిన పోటీదారులు  ఒకరి మీద ఒకరు బాగా కోపంగా ఉన్నారు. రానున్న ఎపిసోడ్స్ లో  ఒకరి పై ఒకరు  అంతెత్తున లేచేలా వారి వ్యవహారం ఉంది.   మెయిన్ గా  యాంకర్ శ్రీముఖి వ్యవహారం పై ఇప్పటికే ఓ అంచనా ఏర్పడుతుంది. అమ్మడికి ఆవేశం కాస్త ఎక్కువే అని నెటిజన్స్ సైతం  కామెంట్స్ చేస్తున్నారు.  రెండో సీజన్లో తేజస్వి  ఎంత హడావుడి చేసిందో..   ఇప్పుడు శ్రీముఖి కూడా ఆ రేంజ్ హడావిడి చేసేలా కనిపిస్తోంది. మరి శ్రీముఖి ఓవర్ యాక్షన్ దెబ్బకి  మిగిలిన వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.  శ్రీముఖి షోలో హాట్ నెస్ తో పాటు హాట్ కామెంట్స్ ను కూడా విసిరేలా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: