సాహో ఈ మూవీ గురించి ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.  ట్రైలర్ ను చూసిన తరువాత ఇందిలో కొన్ని విషయాల గురించి తప్పకుండా చర్చించుకోవాలి.  ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  కాస్త లవ్.. మరికాస్త సెంటిమెంట్ ను మిక్స్ చేసి చూపించారు.  మొత్తానికి ట్రైలర్ మాత్రం యూట్యూబ్ లో సంచలనంగా మారింది.  


ఇక యాక్షన్ సినిమాలకు స్క్రీన్ ప్లే అన్నది ప్రాణం.  అందులోను హాలీవుడ్ రేంజ్ లో స్క్రీన్ ప్లే ఉండాలి.  ప్రతి షాట్ పక్కా స్క్రీన్ ప్లే ప్రకారం షూట్ కావాలి.  అది అంత తేలికైన విషయం కాదు.  పగడ్బందీగా ప్లాన్ చేసి చేయాలి.  అందుకే సాహో సినిమా అంత ఆలస్యం అయ్యింది.  స్క్రీన్ ప్లే కోసమే ఎక్కువ సమయం తీసుకున్నారు.  యాక్షన్ పార్ట్ కోసం ఏకంగా 6 నెలలకు పైగా టైమ్ తీసుకొని షూట్ చేశారు.  


సాహో లో బెస్ట్ సీన్ ఒకటి ఉన్నది.  అదే సీన్ సినిమాలో ఐదుసార్లు రిపీట్ అవుతుందట.  ఈ సీన్ గురించి ప్రభాస్ లీక్ చేశారు.  ఇంకేముంది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.   ఒకే సీన్ ఐదుసార్లు రిపీట్ అయ్యింది అంటే ఆ సీన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో అర్ధం అవుతున్నది.  ఇలాంటి రిపీట్ సీన్స్ స్క్రీన్ ప్లే హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుంది.  


ఈ మధ్యకాలంలో హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలను మనవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు..  ప్రభాస్ వంటి మాస్ యాక్షన్ హీరో ఇలాంటి సినిమా చేస్తున్నాడు అంటే క్రేజ్ ఉంటుంది.  అందులో సందేహం అవసరం లేదు.  పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ ఆగష్టు 30 న థియేటర్లలో సందడి చేయబోతున్నది.  ప్రభాస్ చెప్పినట్టు లాల్ బంగ్లా సీన్ కోసమే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఆ సీన్ కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది సినిమా చూస్తేనే అర్ధం కాదు. రాబరీ చుట్టూనే సినిమా తిరుగుతుంది అనే విషయం ట్రైలర్ లో చెప్పేశారు.  ఇదైతే క్లారిటీ వచ్చింది.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: