సమంత ఏం మాయ చేసావే సినిమా తో కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గ్లామర్ పరంగా ఏమాత్రం అడ్డు చెప్పకుండా యంగ్ హీరోలందరితో రకరకలా పాత్రలు పోషించింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు తమిళంలోను తన సత్తా మాములుగా చాటుకోలేదు. అక్కడ కూడా స్టార్ హీరోస్ సరసన నటించి కోలీవుడ్ లో చాలా మంచి పేరు సంపాదించుకుంది. అయితే పెళ్లి చేసుకున్నాక విభిన్నమైన పాత్రల వైపు మొగ్గుచూపిస్తున్న సమంత ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది . మజిలి సక్సెస్ ని భర్త నాగ చైతన్యతో కలిసి షేర్ చేసుకోగా ఓ బేబీ మాత్రం సోలోగా తన ఖాతాలో పడిపోయింది. ఇక చిన్న క్యామియో చేసిన మావయ్య సినిమా మన్మధుడు 2  దెబ్బెసినా దాని ప్రభావం తన మీద పడలేదు. ఎందుకంటే ఇందులో సమంత మేయిన్ లీడ్ కాదు కాబట్టి. ఇక ప్రస్తుతం శర్వానంద్ తో 96 రీమేక్ కు కమిట్ అయిన సామ్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

కానీ శర్వాకు ఈ షూటింగ్ సమయంలో కాస్త గాయం కావడంతో బ్రేక్ వస్తుందేమో అని ఊహించి ఆ కాల్ షీట్స్ ని ఓ వెబ్ సిరీస్ కు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ షూట్ తోనే చెన్నైలో బిజీగా ఉంది సామ్. 40కి పైగా కాల్ షీట్స్ ఇచ్చిందంటే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా పెద్ద సీజన్ అయ్యుంటుంది. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఎలాగూ వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఊపందుకుంటోంది. హిందీలో ఇప్పటికే వీటి క్రేజ్ ఇంచుమించు సినిమాల స్థాయిలో ఉంది. 

సౌత్ లో వీటి మీద అవగాహన తక్కువ కాబట్టి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. సమంత లాంటి స్టార్స్ చేస్తే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులూ వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తారు. అందులోనూ మేకింగ్ విషయంలోనూ నిర్మాతలు రాజీ పడటం లేదు. మెసేజ్ ఓరియెంటెడ్ ప్రధానంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత రోల్ ఏంటి  దర్శకుడు ఎవరు..? అన్న డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మొత్తానికి అందరికంటే ముందే సమంత అక్కినేని వెబ్ సిరీస్ ల వైపు కన్నేసి తెలివిగా ప్రవర్తిస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: