ఆయుష్మాన్ ఖురానా నటించిన కొత్త చిత్రం "డ్రీమ్ గార్ల్" ట్రైలర్ ఈ రోజు యుట్యూబ్ లో రిలీజ్ అయింది.రోటిన్ కు భిన్నంగా ఆయుష్మాన్ ఖురానా ఎంచుకున్న కథలు మంచి ప్రజాధారణ పొందుతున్నాయి. ఆయన 2018 లో నటించిన రెండు సినిమాలు మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రసంశలు లభించాయి. మొన్న విడుదల చేసినా జాతీయ అవార్డ్ లో ఆయన నటించిన "అంధాధున్" చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. ఈ చిత్రంలో ఆయన మంచి మ్యూజిక్ స్పూర్తి కోసం కళ్ళు లేనివాడి గా నటిస్తాడు.
"డ్రీమ్ గార్ల్" మూవీ షూటింగ్  దాదాపు పూర్తయింది. మిగిలిన షూటింగ్ పాటు డబ్బింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా రోమాంటిక్ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. తన ప్రతీ సినిమాలో ఎదో క్రోత్తదనం  మరియు సున్నితమైన భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటాడు.ఈ సినిమా లో ఉదయం పూట పూజ అనే పేరుతో ఆడ గొంతు తో  కస్టమర్ లతో మాట్లాడే ఉద్యోగిగా కనబడుతున్నాడు.

మరొక వైపు సాయంత్రం పూట లోకేష్ అనే పేరుతో పౌరాణిక పాత్రలు వేసే పాత్రలో కనిపిస్తాడు.ఇందులో "డయిల్ ఎ ఫ్రెండ్" జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆడ గొంతుతో మాట్లాడితే ఎక్కువ మంది ఆట్రాక్ట్ అవుతారని పూజ అనే మారుపేరుతో మాట్లాడాటం మొదలుపెడుతాడు. చివరికి అందరు పూజను ప్రేమిస్తారు. తరువాత ఎం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి.
నుష్రత్ భారుచ లీడ్ లేడి గా నటిస్తుంది. మన్ జొత్ సింగ్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
 
ఎక్త కాపూర్ నిర్మతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాని రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన సోనిలో వచ్చిన కామెడి సర్కల్ కి కమెడి టివి షో కి  రచయితగా పని చేసాడు. ౨౦౧౩ లొ ౬౬౨ స్రిప్ట్స్ రాసినందుకు ఆయన లిమ్క్ బుక్ అఫ్ రికార్డ్ లో ఈయన పేరు నమోదయ్యింది. సెప్ట్ంబర్ ౧౩నా ప్రపంచ వ్యాప్తంగా రిలిజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: