ఈ మద్య సినిమాలు థియేటర్లో కన్న ఇంట్లో కూర్చొని తాపీగా చూస్తున్నవారి సంఖ్యే ఎక్కువైంది.  దానికి గల కారణం పైరసీ. దారుణమైన విషయం ఏంటంటే కొన్ని సినిమాలు థియేటర్లోకి రాకముందే నెట్టింట్లో ప్రత్యక్షం కావడంపై నిర్మాతలు తలలు పట్టుకున్న రోజులు ఉన్నాయి.  అయితే ఈ పైరసీకి మూలాలు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నారు. 

టెక్నాలజీ ఉపయోగించి కొత్త సినిమాలు ఏవి థియేటర్లో రిలీజ్ అయిన గంటల్లో అవి పైరసీ చేయడం నెట్ లో అప్ లోడ్ చేయడం కామన్ అయ్యింది.  దాంతో సినిమా రిలీజ్ రోజూ చాలా మంది జనాలు ఇంట్లోనే కుటుంబంతో చూస్తున్నారు.  దాని వల్ల కలెక్షన్లకు ఘోరమైన దెబ్బ పడుతుంది. ఈ విషయంపై సినీ నటులు, దర్శక, నిర్మాతలు ప్రభుత్వానికి ఎన్నో మార్లు అర్జి పెట్టుకుంటూనే ఉన్నారు.  అంతే కాదు సదరు సైట్ వారు రిలీజ్ అవుతున్న సినిమా తాలూకు దర్శక, నిర్మాతలను హెచ్చరించి మరీ ఆ సినిమాలు రిలీజ్ అయిన రోజే నెట్ లో పెట్డడం గమనార్హం. 

తాజాగా తమిళ్ రాకర్స్, ఈజెడ్ టీవీ, కట్ మూవీస్, లైమ్ టోరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయమని ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవెడర్లన(ఐ.ఎన్.పి) దిల్లీ హైకోర్టు ఆదేశించింది.  బాలీవుడ్, హాలీవుడ్, తమిళం, మలయాళం, తెలుగు సినిమాలని పైరసీ చేయడంలో ఈ గ్రూపు కీలకపాత్ర వహిస్తుంది. తమిళ్ రాకర్స్వెబ్ సైట్ ని మూసివేయాల్సిందిగా ప్రముఖ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ గత మూడేళ్ళుగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సైట్ల యూఆర్ఎల్స్, ఐపీ అడ్రెస్ లను బ్లాక్ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా, పలు నిర్మాణ సంస్థల కాపీరైట్లను ఉల్లంఘించాయంటూ వాటి డొమైన్ రిజిస్ట్రేషన్లను కూడా తొలగించాలంటూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: