కొరియన్ సినిమాలు అనగానే మనకు యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి.  ఇండియన్ ఫిలిం దర్శకులు యాక్షన్ పార్ట్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కొరియన్ సినిమాల నుంచి తీసుకుంటూ ఉంటారు.  యాక్షన్ సినిమా అంటే కొరియన్ సినిమా అనే విధంగా మారిపోయింది.  కొరియా సినిమాలు కేవలం యాక్షన్ మాత్రమే కాదు బలమైన సామాజిక నేపధ్యం కలిగిన కథలతో కూడా సినిమాలు చేస్తున్నారు.  ఇప్పటికే అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి.  మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.  


ఇలా వచ్చిన సినిమాల్లో మిస్ గ్రానీ ఒకటి.  ఈ సినిమా ఈ సినిమా 2014లో కొరియాలో రిలీజ్ అయ్యింది.  74 ఏళ్ల మహిళా 20 ఏళ్ల అమ్మాయిగా మారితే ఎలా ఉంటుంది అనే కథతో కామెడీ డ్రామాగా తెరకెక్కించారు.  3.2 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపుగా 51.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.  ఇది బిగ్గెస్ట్ హిట్ ని చెప్పాలి.  ఈ సినిమాను ఆ తరువాత ఫిలిప్పీన్స్ లో రీమేక్ చేశారు.  ఇదే సినిమాను తెలుగులో ఓ బేబీగా వచ్చింది.  


సమంత హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.  తెలుగు సినిమా నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను మార్పులు చేశారు.  సినిమాను మంచి కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు.  ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  సమంత సోలో హీరోయిన్ గా వచ్చినా వసూళ్లు మాత్రం భారీగా ఉన్నాయి.  రూ. 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. దాదాపు రూ. 40 కోట్లు వసూలు చేసింది.  సమంత సోలోగా చేసిన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గ్రేట్ అని చెప్పాలి.  


ఇదిలా ఉంటె, ఈ ఏడాదే మరో కొరియన్ సినిమాను రీమేక్ చేశారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొరియాలో హిట్టైన ఒడే టు మే ఫాదర్ సినిమాను భారత్ గా రీమేక్ చేశారు. లైఫ్ జర్నీ నేపథ్యంలో సినిమా తెరక్కెక్కింది.  మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సల్మాన్ కు ఈ సినిమా ఊరటను ఇచ్చింది. ఈ ఏడాది ఈద్ పండుగ రోజున వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది.  దాదాపు రూ. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 341 కోట్లు వసూళ్లు సాధించింది.  సల్మాన్ భారీ వసూళ్లు చేసిన సినిమాల్లో ఇదొకటిగా ఇదొకటిగా నిలిచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: