బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా జాకీ ష్రఫ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి విజువల్ ఎఫెక్ట్స్ పూర్తవని కారణంగా ఆగస్ట్ 30 కి మార్చారు చిత్ర బృందం. ఇక ఇంతటి భారీ బడ్జెట్ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ బారీగానే చెల్లించి కొనడటం సహజం. అంతేకాదు ఇక్కడికంటే యూఎస్ లో ఒక రోజు ముందుగానే సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ప్రీమియర్ షో ద్వారా ఒక రోజు ముందే రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు మేకర్స్. 

పైగా ప్రభాస్ కి యూఎస్ మార్కెట్ ఎక్కువ. బాహుబలి తో ఆ మార్కెట్ ఇంకా ఎక్కువగా పెరిగింది. అందుకే ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకునే అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో వేసి భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టుకోవాలని  ఆలోచించారు. కానీ అదంతా ఇప్పుడు తారుమారు అయిందని తెలుస్తోంది. కానీ కొన్ని కారణాలు వల్ల సాహో యూఎస్ ప్రీమియర్ షోస్ ను క్యాన్సల్ చేశారట మేకర్స్. అందుకు సంబంధించిన అసలు కారణాలు ఏంటో తెలియదు కానీ ముందు నుంచీ ప్లాన్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ప్రస్తుతం ఏమి అర్ధంకాక అయోమయ పరిస్థితిలో ఉన్నారట. ఈసినిమా యొక్క రైట్స్ ఎవరు ఊహించని విధంగా భారీ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ప్రీమియర్స్ ద్వారా ఎంతో కొంత రాబడదాం అని అనుకున్నారు. 

కానీ చివరి నిమిషంలో మేకర్స్ హ్యాండ్ ఇవ్వడంతో ఏం చేయాలో తోచక జుట్టు పీక్కుంటున్నారట. అయితే ప్రీమియర్ షోస్ పడకపోయినా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువే వస్తోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే కేవలం ప్రీమియర్ షోస్ రద్దు అవ్వడం వల్లే సాహో డిస్ట్రిబ్యూటర్స్ పది కోట్లు మేరకు నష్టం వాటిల్లే అవకాశాలు బాగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సాహో కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన థియోట్రికల్ ట్రైలర్ చాలా బాగుండంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసలు ఆగడంలేదు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్, డైరెక్టర్స్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తన పెదనాన్న సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: