మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇంతకముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ తర్వాత సినిమా అందులోను త్రివిక్రమ్ కలిసి హ్యాట్రిక్ కొట్టబోయో ప్రాజెక్ట్ కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టైటిల్ ఏంటని మెగా ఫ్యాన్స్ బాగా ఆరాటపడుతున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి మాదిరిగా ఈ కథ కూడా నాన్న సెంటిమెంట్ తో నడుస్తుందని సమాచారం. అందుకే ముందు నుంచి ఈ సినిమా టైటిల్ నేను నాన్న అని ప్రచారం జరుగుతోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కాకినాడలో షూట్ చేశారు. అయితే ఆగస్ట్ 15 న బన్నీ, మెగా ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ఫ్రైజ్ ఇవ్వడానికి చిత్రబృందం సిద్ధమైందని లేటెస్ట్ న్యూస్.ఇప్పటికే ‘నేను - నాన్న’ అనే పేరుతో తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ తో త్రివిక్రమ్ రాబోతున్నారని మాత్రం తెలిసిన విషయమే. అయితే ఇది పక్కా అని మాత్రం చిత్రబృందం క్లారిటి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 15 న బన్నీ ఫ్యాన్స్‌ ఇచ్చే బిగ్‌ సర్‌ఫ్రైజ్ టైటిల్ రివీల్ చేయడమేనని ట్విట్టర్ ద్వారా మాటల మాంత్రికుడు అప్‌డేట్ ని ఇచ్చారు. ఈ అప్‌డేట్ బన్ని ఫ్యాన్స్ కి మాటల మాంత్రీకుడు ఇస్తారని ఎవరు ఊహించకపోవడం ఆసక్తికరం.

త్రివిక్రమ్ ఈ అప్‌డేట్ ఇచ్చినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ టైటిల్ ఏమై ఉంటుందని తెగ ఆరాటపడుతున్నారు. మరి ఈ ఆరాటం తగ్గాలంటే 15 వరకు ఆగక తప్పదు. ఇక ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయడానికే శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో పోటి పడటానికి సూపర్ స్టార్ మహేష్ తో అనిల్ రావి పూడి దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు కూడా 2020 సంక్రాంతికే వస్తోంది. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్, బన్ని ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. మొన్న రిలీజ్ చేసిన సరిలేరు నీకెవ్వరు లుక్ మీద విపరీతంగా కామెంట్స్ చేశారు బన్ని ఫ్యాన్స్. ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్ది ఈ రచ్చ ఇంకెంతగా జరుగుతుందోనని ఫిల్మ్ నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 2020 సంక్రాంతికే బాలయ్య సినిమా కూడా రానుందని తెలుస్తోంది. వీటితో పాటు సూపర్ స్టార్ రజనీ కాంత్ దర్బార్ ను సంక్రాంతి బరిలో దింపనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: