సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతల ముద్దుల పిల్లలు గౌతమ్ మరియు సితార ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండి తండ్రి మహేష్ లానే మంచి చలాకీగా ఉంటూ, తమకు సంబందించిన విషయాలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటుంటారు. ఇకపోతే ఈ విషయంలో సితార ఒకింత ముందుకు దూసుకుపోతోంది. ఇటీవల భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్త ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 

ఆ ఛానల్ లో మొన్న తండ్రి మహేష్ బాబు జన్మదినం సందర్భంగా విష్ చేసి విపరీతంగా సందడి చేసింది. ఇకపోతే నేడు మహేష్ నటించిన ఇటీవలి సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలోని 'పాలపిట్ట' సాంగ్ కు తనదైన ఆకట్టుకునే స్టయిల్ లో సితార వేసిన డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నమ్రత గారు ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ వీడియోలో సితార డాన్స్ చూస్తుంటే, రేపు పెరిగి పెద్దయి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే గనుక, తండ్రి సూపర్ స్టార్ మహేష్ వలె, సితార కూడా మంచి నటిగా పేరు సంపాదిస్తుందని చెప్పవచ్చని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇక ఈ వీడియోను చూసి విపరీతమైన సంతోషపడుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, 

దానిని వారి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్స్, లైక్స్ తో హోరెత్తిస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. అయితే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రోత్సాహంతో మహేష్ బాలనటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసినట్లుగా మహేష్ మరియు నమ్రత గార్ల ఆశీర్వాదంతో సితారను కూడా ఏదైనా ఒక మంచి సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేయిస్తే బాగుంటుందని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికల్లో పంచుకుంటున్నారు. మరి అభిమానుల కోరికను సూపర్ స్టార్ దంపతులు ఎంతవరకు నెరవేరుస్తారో తెలియాలంటే కొన్నాళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: