సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. కానీ ఇద్దరూ బిజీగా ఉండటంతో సీక్వెల్ రూపొందించడానికి చాలా కాలం పట్టింది.  అయితే 2.0 నిర్మాణం కూడా చాలా కాలం పట్టింది. మొత్తానికి అన్ని హంగులతో అద్భుతమై వ్యూజువల్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.  మొదటి సారిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ మూవీలో విలన్ గా నటించారు. 

సెల్ ఫోన్ వాడకంతో ప్రకృతి వినాశనం అవుతుందని..ముఖ్యంగా ఎన్నో పక్షిజాతులు అంతరించిపోతున్నాయన్న మెసేజ్ ఈ మూవీ లో చూపించారు.  ఈ సినిమా అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ సాధించలేక పోయింది. కాకపోతే కలెక్షన్ల పరంగా నాట్ బ్యాడ్ అనిపించుకుంది.   అప్పట్లో ఈ మూవీ  వరల్డ్ వైడ్ గా రిలీజైన   చైనాలో మాత్రం రిలీజ్ కాలేదు. ఎప్పటి నుంచో బయ్యర్లు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పటికీ వర్కవుట్ కావడం లేదు.  సూపర్ స్టార్ రజినీకాంత్ కి భారత్ లోనే కాదు..చైనా, జపాన్, హాంకాంగ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. 

ఆయన నటించిన ప్రతి సినిమా ఆయా దేశాల్లో రిలీజ్ అవుతుంది. కొన్ని సినిమాలైతే భారీగానే లాభాలు సాధించాయి.  తాజాగా 2.0 చైనాలో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.  సెప్టెంబర్ 6న విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. అసలైతే జులై సెకండ్ వీక్ లోనే ఈ సినిమా చైనాలో రిలీజ్ కావాల్సింది. కానీ ద లయన్ కింగ్ మ్యానియా అప్పుడు డామినేట్ చేయడంతో రిస్క్ చేయకూడదని వాయిదా వేస్తూ వచ్చారు.  సెప్టెంబరు 6న చైనాలో ఈ చిత్రం 47,000 కంటే ఎక్కువగా త్రీడీ స్క్రీన్లపై రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్ లో చైనాలో రిలీజవుతున్న విదేశీ చిత్రం ఇప్పటివరకు మరొకటి లేదు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ, హెచ్ వై మీడియా సంస్థతో కలిసి 2.ఓ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తోంది.   వచ్చే నెల విడుదల కాబోతున్న ఈ సినిమా చైనాలో ఒక రికార్డ్ ను క్రియేట్ చేయబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: